Supriya Shrinate : మోదీ పాల‌న‌లో అన్నీ స్కామ్ లే

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత సుప్రియా శ్రీ‌నాటే

Supriya Shrinate : ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ పాల‌న‌లో స్కామ్ లు త‌ప్ప స్కీమ్ లు ఏవీ లేవ‌న్నారు కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత సుప్రియా శ్రీ‌నాటే. ప్ర‌జ‌ల చెవుల్లో పూలు పెట్టిన ఘ‌న‌త మీకే ద‌క్కుతుంద‌న్నారు. ఆచ‌ర‌ణ‌కు నోచుకోని హామీలు ఇవ్వ‌డం ఆ త‌ర్వాత దాట వేయ‌డం ప‌రిపాటిగా మారింద‌న్నారు. బుధ‌వారం సుప్రియా శ్రీ‌నాటే(Supriya Shrinate) మీడియాతో మాట్లాడారు.

Supriya Shrinate Slams Modi

ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆర్థిక నేర‌గాళ్లు పెరిగి పోయార‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌రిని కూడా భార‌త్ కు తీసుకు రాలేక పోయార‌ని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి రోజు రోజుకు పెరుగుతున్న ఆద‌ర‌ణ‌ను చూసి త‌ట్టుకోలేక పోతున్నార‌ని మండిప‌డ్డారు. ఓ వైపు మ‌ణిపూర్ రాష్ట్రంలో ఇంకా హింస కొన‌సాగుతూనే ఉన్న‌ద‌ని దానిని కంట్రోల్ చేయ‌డంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అదుపు త‌ప్పాయ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

దేశంలో పేరు పొందిన ప్ర‌భుత్వ సంస్థ కంట్రోల‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్ (కాగ్ ) కీల‌క వ్యాఖ్య‌లు చేసింద‌ని మోదీ ఈ 9 సంవ‌త్స‌రాల పాల‌న‌లో అమ‌లు చేసిన చాలా ప‌థ‌కాల‌లో అవినీతి పెచ్చ‌రిల్లి పోయింద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టింద‌న్నారు. క‌నీసం సిగ్గు రావ‌డం లేదా అంటూ సుప్రియా శ్రీ‌నాటే ప్ర‌శ్నించారు.

Also Read : Gidugu Rudra Raju : ద‌ర్శి ఘ‌ట‌న సిగ్గు చేటు – రుద్ర‌రాజు

Leave A Reply

Your Email Id will not be published!