Surya kumar Yadav : అరుదైన రికార్డ్ కు చేరువలో సూర్య భాయ్
7 పరుగులు చేస్తే శిఖర్ ధావన్ రికార్డ్ మటాష్
Surya kumar Yadav : భారత క్రికెట్ జట్టులో కీలకమైన క్రికెటర్ గా పేరొందాడు స్టార్ హిట్టర్ సూర్య కుమార్ యాదవ్. కేవలం 7 పరుగుల దూరంలో ఉన్నాడు అరుదైన ఘనత సాధించేందుకు. ప్రస్తుతం భారత క్రికెటర్లలో సూర్య కుమార్ యాదవ్(Surya kumar Yadav) సూపర్ ఫామ్ లో కొనసాగుతున్నాడు.
గత మూడు సంవత్సరాలుగా పేలవమైన ఆట తీరుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఎట్టకేలకు పరుగుల వేటలో పడడంతో
అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఒకానొక దశలో అక్టోబర్ లో ఆస్ట్రేలియాలో జరిగే టి20 వరల్డ్ కప్ లో పాల్గొనే జట్టుకు ఎంపికవుతాడా అన్న అనుమానం నెలకొంది.
వాటన్నింటిని పటాపంచలు చేస్తూ దుబాయి వేదికగా జరిగిన ఆసియా కప్ -2022లో రాణించాడు. కోహ్లీకి పోటీగా మిడిల్ ఆర్డర్ లో దుమ్ము రేపుతూ
వస్తున్నాడు సూర్య కుమార్ యాదవ్(Surya kumar Yadav). ఒక రకంగా తాజా, మాజీ క్రికెటర్లు అతడిని భారత డివిలియర్స్ అని పేరు పెట్టారు.
ఇదే సమయంలో పాకిస్తాన్ క్రికెట్ మాజీ దిగ్గజం వసీం అక్రమ్ అయితే పాకిస్తాన్ ను హెచ్చరించాడు. జట్టులో ఎవరు ఉన్నా సరే సూర్య కుమార్ యాదవ్ పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాలో జరిగిన టి20 సీరీస్ లో సత్తా చాటాడు.
హైదరాబాద్ ఉప్పల్ లో జరిగిన కీలకమైన మ్యాచ్ లో 36 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు 5 సిక్సర్లతో 69 పరుగులు చేసి దుమ్ము రేపాడు. ప్రస్తుతం
దక్షిణాఫ్రికాతో మూడు టి20లు, మూడు వన్డేల సీరీస్ కు సిద్దమైంది.
ఒక క్యాలండర్ ఇయర్ లో ఎక్కువ పరుగులు చేసిన క్రికెటర్ గా జస్ట్ 7 పరుగుల దూరంలో ఉన్నాడు సూర్య కుమార్ యాదవ్. 2018లో ధావన్ 689 పరుగులు చేసి టాప్ లో ఉన్నాడు. సూర్య 682 రన్స్ తో నిలిచాడు.
Also Read : టీమిండియా టి20 టీమ్ డిక్లేర్