Kane Williamson : ‘సూర్య’ భాయ్ ని త‌ట్టుకోవ‌డం కష్టం – కేన్

ప్ర‌పంచంలో అత్యుత్త‌మ ఆట‌గాడు

Kane Williamson : భార‌త దేశానికి చెందిన స్టార్ హిట్ట‌ర్ బ్యాట‌ర్ సూర్య కుమార్ యాద‌వ్(Surya Kumar Yadav) ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు. న్యూజిలాండ్ లో ప‌ర్య‌టిస్తున్న టీమిండియాలో విధ్వంస‌క‌ర‌మైన బ్యాట‌ర్ గా పేరొందాడు. టీ20 సీరీస్ లో భాగంగా జ‌రిగిన రెండో టి20 మ్యాచ్ లో మ‌నోడు దుమ్ము రేపాడు.

ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. కేవ‌లం 51 బంతుల్లో 111 ప‌రుగులు చేశాడు. త‌న పొట్టి ఫార్మాట్ కెరీర్ లో రెండో అత్యుత్త‌మ సెంచ‌రీని సాధించాడు సూర్య కుమార్ యాద‌వ్. దీంతో భార‌త జ‌ట్టు 191 ప‌రుగుల భారీ టార్గెట్ ఆతిథ్య జ‌ట్టు న్యూజిలాండ్ ముందు ఉంచింది. అనంత‌రం దీప‌క్ హూడా బౌలింగ్ దెబ్బ‌కు కీవీస్ ఆట‌గాళ్లు పెవిలియ‌న్ దారి ప‌ట్టారు.

65 ప‌రుగుల తేడాతో భార‌త జ‌ట్టు అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. మ్యాచ్ అనంత‌రం న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్ మీడియాతో మాట్లాడాడు. ప్ర‌త్యేకించి సూర్య కుమార్ యాద‌వ్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. ఏకంగా అత‌డి ఆట తీరు అద్భుతం అంటూ కొనియాడాడు కేన్ .

త‌న ఇన్నేళ్ల క్రికెట్ కెరీర్ లో ఇలాంటి ఆట‌గాడిని చూడ లేద‌ని కితాబు ఇచ్చాడు. క‌ళ్లు చెదిరేలా షాట్స్ ఆడాడ‌ని, కొన్నింటిని తాను ఇప్ప‌టి వ‌ర‌కు ఆడ‌లేద‌ని స్ప‌ష్టం చేశాడు. తాను మైదానంలో ఉన్న స‌మ‌యంలో షాక్ కు గురైన‌ట్లు చెప్పాడు.

ఒక ర‌కంగా భార‌త జ‌ట్టుకు సూర్య కుమార్ యాద‌వ్ ఓ వ‌రం అని పేర్కొన్నాడు కేన్ విలియ‌మ్స‌న్(Kane Williamson). ప్ర‌పంచంలోనే సూర్య భాయ్ అత్యుత్త‌మైన ఆట‌గాడు అని అన్నాడు.

Also Read : చివ‌రి మ్యాచ్ కు కేన్ మామ దూరం

Leave A Reply

Your Email Id will not be published!