Harbhajan Singh : సూర్య కుమార్ పై భ‌జ్జీ కామెంట్స్

జ‌ట్టులో లేక పోవ‌డం పెద్ద లోటు

Harbhajan Singh : మాజీ క్రికెట‌ర్, ఆప్ ఎంపీ హ‌ర్భ‌జ‌న్ సింగ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)పై నిప్పులు చెరిగాడు. ఐసీసీ ప్ర‌పంచ టెస్ట్ ఛాంపియ‌న్ షిప్ కు సంబంధించి భార‌త జ‌ట్టును ఎంపిక చేసింది. సుదీర్ఘ కాలం త‌ర్వాత అజింక్యా ర‌హానే చోటుద‌క్కించుకున్నాడు. శ్రేయాస్ అయ్యర్ కు గాయం కావ‌డంతో అత‌డి స్థానంలో ర‌హానేకు ఛాన్స్ ఇచ్చింది బీసీసీఐ. ఇదే క్ర‌మంలో తాజాగా జ‌రుగుతున్న ఐపీఎల్ 16వ సీజ‌న్ లో 199 స్ట్రైక్ రేట్ తో దుమ్ము రేపుతున్నాడు ర‌హానే. ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నాడు.

ఇప్ప‌టికే ఆస్ట్రేలియాలో ఘ‌న‌మైన రికార్డు న‌మోదై ఉంది అత‌డిపై. ఈ త‌రుణంలో హ‌ర్భ‌జ‌న్ సింగ్(Harbhajan Singh) కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. డ‌బ్ల్యూటీసీ ఫైనల్ జ‌ట్టును ఎంపిక చేసిన తీరు బాగానే ఉన్న‌ప్ప‌టికీ ఆస్ట్రేలియాలో ఆ జ‌ట్టును ఎదుర్కోవాలంటే పైకి వ‌చ్చే బంతుల‌ను ఎదుర్కొనే స‌త్తా సూర్య కుమార్ యాదవ్ కు ఉంద‌న్నాడు. ఈ జ‌ట్టులో సూర్య కుమార్ కు ఎందుకు ఛాన్స్ ఇవ్వేలేదంటూ ప్ర‌శ్నించారు హ‌ర్భ‌జ‌న్ సింగ్.

ప్ర‌స్తుతం ఆయ‌న చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. ప్ర‌స్తుతం శ్రేయాస్ స్థానంలో ర‌హానే త‌ప్ప మేనేజ్ మెంట్ కు వేరే మార్గం లేద‌ని పేర్కొన్నాడు. అయితే సూర్య కుమార్ యాద‌వ్ జ‌ట్టులో త‌ప్ప‌నిస‌రిగా ఉండాల్సిన ఆట‌గాడు అని తెలిపాడు. సెలెక్ట‌ర్లు ముగ్గురు స్పిన్న‌ర్ ల కోసం వెళ్లే బ‌దులు అద‌న‌పు బ్యాట‌ర్ ని ఎంచు కోవాల్సి ఉంద‌ని పేర్కొన్నాడు .

Also Read : ఆడం జంపా మ్యాజిక్ చెన్నై షాక్

Leave A Reply

Your Email Id will not be published!