Surya Kumar Yadav : సూర్య స్కిప్పర్ రోహిత్ ఇంపాక్ట్ ప్లేయర్
భారీ స్కోర్ ను ఛేదించిన ముంబై ఇండియన్స్
Surya Kumar Yadav : ఐపీఎల్ 16వ సీజన్ లో కీలక మార్పు చోటు చేసుకుంది. ముంబై ఇండియన్స్ స్కిప్పర్ గా రోహిత్ శర్మ కు బదులుగా సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరించాడు. విచిత్రం ఏమిటంటే హిట్ మ్యాన్ ఇంపాక్ట్ ప్లేయర్ గా మైదానంలోకి వచ్చాడు.
కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ మొత్తానికి నాయకత్వం వహించాడు సూర్య కుమార్ యాదవ్(Surya Kumar Yadav). ముంబై ఇండియన్స్ స్కిప్పర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కోల్ కతా భారీ స్కోర్ చేసింది. ఆ జట్టుకు చెందిన వెంకటేశ్ అయ్యర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తొలి సెంచరీ నమోదు చేశాడు. ఐపీఎల్ లీగ్ లో తొలి సెంచరీని సన్ రైజర్స్ హైదరాబాద్ కు చెందిన స్టార్ క్రికెటర్ హ్యారీ బ్రూక్ సాధిస్తే రెండో సెంచరీని అయ్యర్ నమోదు చేశాడు.
అనంతరం బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఊహించని రీతిలో షాక్ ఇచ్చింది. ఇషాన్ కిషన్ 25 బంతుల్లో హాఫ్ సెంచరీ తో దుమ్ము రేపాడు. రోహిత్ శర్మతో కలిసి కిషన్ 65 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పాడు. అనంతరం కెప్టెన్ గా ఉన్న సూర్య కుమార్ యాదవ్ 43 పరుగులతో ఆకట్టుకున్నాడు.
ఇక తెలుగు కుర్రాడు తిలక్ వర్మ 30 పరుగులతో కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా 17.4 ఓవర్ల లోనే కోల్ కతా భారీ టార్గెట్ ను ఛేదించింది ముంబై ఇండియన్స్ . స్కిప్పర్ గా సూర్య ఇంపాక్ట్ ప్లేయర్ గా రోహిత్ ఆడడం ఐపీఎల్ లో విశేషం.
Also Read : షిమ్రోన్ హెట్మెయర్ ‘హిట్’మయర్