Surya kumar Yadav : మెరిసిన సూర్య కుమార్ యాదవ్
ముంబై ఇండియన్స్ గెలుపులో పాత్ర
Surya Kumar Yadav : ఐపీఎల్ 16వ సీజన్ లో భాగంగా ముంబై వేదికగా జరిగిన కీలక పోరులో రాజస్థాన్ రాయల్స్ గెలుపు అంచుల దాకా వచ్చి చతికిలపడింది. 6 వికెట్ల తేడాతో ఓడి పోయింది. కెప్టెన్ సంజూ శాంసన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 212 రన్స్ చేసింది.
యంగ్ క్రికెటర్ యశస్వి జైశ్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 62 బంతులు మాత్రమే ఎదుర్కొని 16 ఫోర్లు 8 సిక్సర్లతో రెచ్చి పోయాడు. 124 పరుగులు చేసి అత్యధిక వ్యక్తిగత స్కోరర్ గా నిలిచాడు ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో.
అనంతరం 213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఇంకా 3 బంతులు మిగిలి ఉండగానే విక్టరీ సాధించింది. కామెరాన్ గ్రీన్ 44 రన్స్ తో సత్తా చాటాడు. ఆ తర్వాత సూర్య కుమార్ యాదవ్(Surya Kumar Yadav) మెరుపులు మెరిపించాడు. కేవలం 29 బంతులు ఎదుర్కొని 55 రన్స్ చేశాడు. తిలక్ వర్మ , టిమ్ డేవిడ్ కలిసి రాజస్థాన్ రాయల్స్ ఆశలపై నీళ్లు చల్లారు.
ఆఖరి ఓవర్ లో 17 పరుగులు కావాల్సి ఉండగా జేసన్ హోల్డర్ బౌలింగ్ లో వరుసగా మూడు హ్యాట్రిక్ సిక్సర్లతో హోరెత్తించాడు టిమ్ డేవిడ్. చివరకు కింగ్ డేవిడ్ గా మారాడు. డేవిడ్ 14 బాల్స్ ఎదుర్కొని 45 రన్స్ చేస్తే వర్మ 21 బంతులు ఆడి 29 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. మొత్తంగా సూర్య కుమార్ యాదవ్ తన సత్తా ఏమిటో చాటాడు.
Also Read : జైశ్వాల్ ఇన్నింగ్స్ సూపర్ – రోహిత్