Rahul Dravid : సూర్య సూపర్ కోహ్లీ వండర్ – ద్రవిడ్
ఆసిస్ పై మ్యాచ్ విన్నింగ్ పై హెడ్ కోచ్
Rahul Dravid : ఆస్ట్రేలియాపై మూడో టి20 మ్యాచ్ లో గెలుపొందడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్. జట్టు పరంగా అన్ని రంగాలలో రాణించిందన్నాడు. టి20 సీరీస్ గెలువడంపై సంతోషం వ్యక్తం చేశాడు. సూర్య కుమార్ యాదవ్ సూపర్ గా ఆడాడని విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించాడని పేర్కొన్నాడు.
సీరీస్ గెలవడంలో మిగతా ఆటగాళ్లు కూడా కీలక పాత్ర పోషించారంటూ పేర్కొన్నారు హెడ్ కోచ్. చివరి ఓవర్ దాకా ఉత్కంఠ భరితంగా సాగిందన్నారు. ఆట అన్నాక గెలుపు ఓటములు సర్వ సాధారణమైన విషయమని స్పష్టం చేశారు రాహుల్ ద్రవిడ్(Rahul Dravid).
కెప్టెన్ రోహిత్ శర్మ 17 పరుగులు చేస్తే వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మరోసారి నిరాశ పరిచినా ఆ తర్వాత విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్ కలిసి ఇన్నింగ్స్ ను కుదుట పరిచినట్లు తెలిపాడు. మరోసారి తానేమిటో నిరూపించుకున్నాడని సూర్య భాయ్ ని ప్రశంసలతో ముంచెత్తాడు. ఎప్పటి లాగే విరాట్ కోహ్లీ కూడా రాణించాడని కితాబు ఇచ్చాడు.
ఆ తర్వాత బరిలోకి దిగిన హార్దిక్ పాండ్యా అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో సత్తా చాటాడని తెలిపాడు. ఇలాంటి మ్యాచ్ లు ఆటగాళ్ల సామర్థ్యాలను మరోసారి పెంచేందుకు దోహద పడుతాయని పేర్కొన్నాడు రాహుల్ ద్రవిడ్.
187 పరుగుల భారీ స్కోర్ ను ఛేదించడం సాఫీగా సాగిందన్నారు. సూర్య కుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ కలిసి కేవలం 62 బంతులు ఎదుర్కొని 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారని కితాబు ఇచ్చారు హెడ్ కోచ్. ఎప్పటి లాగే పాండ్యా ఫినిషింగ్ టచ్ ఇచ్చాడని పేర్కొన్నారు.
Also Read : చెలరేగిన సూర్య సత్తా చాటిన కోహ్లీ