Swara Bhasker : స్వ‌ర భాస్క‌ర్ ట్వీట్ వైర‌ల్

రాఘ‌వ్ చ‌ద్దాకు వెరైటీ విషెష్

Swara Bhasker: రాఘ‌వ్ చ‌ద్దా ఈ మ‌ధ్య ఎక్కువ‌గా వినిపిస్తున్న పేరు. ఆయ‌న ఆమ్ ఆద్మీ పార్టీలో కీల‌క వ్య‌క్తిగా ఉన్నారు (Aam Adami Party). తాజాగా పంజాబ్ లో జ‌రిగిన శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో ఆప్ ను విజ‌య‌ప‌థంలో తీసుకు వెళ్ల‌డంలో ముఖ్య పాత్ర పోషించారు(AAP).

ఆయ‌న ఆ రాష్ట్రానికి ఇన్ చార్జ్ గా ప‌ని చేశారు. ఢిల్లీలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా రాఘ‌వ్ చద్దా పార్టీలోనే కాదు పార్టీ క‌న్వీన‌ర్, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ కు న‌మ్మ‌క‌స్తుడు.

ఆయ‌న టీంలో కీల‌క వ్య‌క్తి. దీంతో ఊహించ‌ని రీతిలో కేజ్రీవాల్ రాఘ‌వ్ చద్దాకు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు. ఆయ‌న‌ను ఏకంగా ఆప్ త‌ర‌పున పంజాబ్ నుంచి రాజ్య‌స‌భ‌కు నామినేట్ చేశారు.

చద్దాతో పాటు ప్ర‌ముఖ మాజీ క్రికెట‌ర్ హ‌ర్బ‌జ‌న్ సింగ్ , అశోక్ మిట్ట‌ల్ , ప్రొఫెస‌ర్ సందీప్ పాఠ‌క్ , సంజీవ్ అరోరాల‌కు కూడా ఛాన్స్ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఆప్ నామినేట్ చేసిన అభ్య‌ర్థుల‌కు పోటీగా ప్ర‌ధాన పార్టీలు ద‌ర‌ఖాస్తు చేయ‌లేదు.

దీంతో ఆప్ ఎంపిక చేసిన ఐదుగురు ఏక‌గ్రీవంగా రాజ్య‌స‌భ‌కు ఎన్నికైన‌ట్లు రాజ్య‌స‌భ ఎన్నిక‌ల అధికారి వెల్ల‌డించారు. ఈ త‌రుణంలో రాఘ‌వ్ చ‌ద్దాకు అన్ని రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు అభినంద‌న‌లు తెలియ చేస్తున్నారు.

ఇదే స‌మ‌యంలో (leading Actress)ప్ర‌ముఖ న‌టి స్వ‌ర భాస్క‌ర్(Swara Bhasker) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. చ‌ద్దా, స్వ‌ర భాస్క‌ర్ లు ఇద్ద‌రూ మంచి స్నేహితులు. వారి మ‌ధ్య ఉన్న సాన్నిహిత్యం మేర‌కు ఆమె డిఫ‌రెంట్ గా ట్వీట్ చేయ‌డం, అది వైర‌ల్ గా మార‌డం జ‌రిగింది.

ఇక నుంచి మిమ్మ‌ల్ని చ‌ద్దా అని కాకుండా గారు అని కూడా పిల‌వాల్సి ఉంటుందేమోనంటూ పేర్కొన్నారు. దీనికి ఆస‌క్తిక‌రంగా రీట్వీట్ చేశారు రాఘ‌వ్ చ‌ద్దా.

గారు అని పిల‌వాల్సిన ప‌ని లేదు. ఎందుకంటే అలా పిలిస్తే పార్ల‌మెంట‌రీ హ‌క్కుల‌ను ఉల్లంఘించిన‌ట్లు అవుతుంద‌ని పేర్కొన్నారు.

Also Read : ఆర్ఆర్ఆర్ అమూల్ అదుర్స్

Leave A Reply

Your Email Id will not be published!