Swati Maliwal Yogi : సీఎం యోగికి స్వాతి మలివాల్ లేఖ
ఫేక్ రేప్ కేస్ అని తేలితే చర్యలు
Swati Maliwal Yogi : ఉత్తర్ ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో 36 ఏళ్ల మహిళపై జరిగిన గ్యాంగ్ రేప్ పై విచారణకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ (చీఫ్) స్వాతి మలివాల్(Swati Maliwal Yogi) స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ కు లేఖ రాశారు.
ఒకవేళ ఈ విచారణలో మహిళ చేసిన ఆరోపణలు అవాస్తవమని తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఇందులో ఎవరు చేసిన తప్పేనని స్పష్టం చేశారు స్వాతి మలివాల్. ఈ కేసు గురించి అక్టోబర్ 18న తన హెల్ప్ లైన్ నంబర్ కు కాల్ వచ్చిందని మలివాల్ చెప్పారు.
ఆస్తి వివాదంలో చిక్కుకున్న ఐదుగురు వ్యక్తులపై కల్పిత సామూహిక అత్యాచారం అభియోగం మోపినందుకు ఘజియాబాద్ పోలీసులు సదరు మహిళ, మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఒక రోజు తర్వాత స్వాతి మలివాల్ స్పందించారు. 181 నెంబర్ కు కాల్ వచ్చింది.
వెంటనే ఆస్పత్రికి కౌన్సెలర్ ను పంపించారు. ఆమె సంభాషించింది. మహిళ తనపై ఐదుగురు వ్యక్తులు రెండు రోజుల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించింది. తన ప్రైవేట్ భాగాలలో ఇనుప రాడ్ ను కూడా చొప్పించినట్లు వాపోయిందని తెలిపిందన్నారు స్వాతి మలివాల్.
ఆపై తనను కట్టేసి గోనె సంచిలో రోడ్డు పక్కన పడేసినట్లు పేర్కొంది. కమిషన్ ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసిందని డీసీడబ్ల్యూ చీఫ్ వెల్లడించారు. మహిళా వైద్య నివేదికను పరిశీలించిందన్నారు.
Also Read : దమ్ముంటే హరివంశ్ తో రాజీనామా చేయించు