Tadipatri: తాడిపత్రి ఆర్వోను మార్చిన ఎన్నికల కమీషన్ !

తాడిపత్రి ఆర్వోను మార్చిన ఎన్నికల కమీషన్ !

Tadipatri: అనంతపురం జిల్లా తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి(ఆర్వో) రాంభూపాల్‌ రెడ్డిని రాష్ట్ర ఎన్నికల సంఘం విధుల నుండి తప్పించింది. ఆయన స్థానంలో ప్రత్యేక ఉప కలెక్టర్‌ శిరీషను నియమించింది. ఈ మేరకు గురువారం వేర్వేరుగా ఉత్తర్వులు జారీచేసింది. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నానంటూ, జూన్‌ 1 నుంచి 15 రోజులపాటు మెడికల్ లీవ్ కావాలంటూ జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్‌ వినోద్‌ కుమార్‌ కు రాంభూపాల్‌ రెడ్డి విన్నవించారు. కలెక్టర్‌ ఈ వినతిని ఈసీకి పంపగా… ఈసీ నుండి అనుమతి లభించింది. దీనితో సీఈఓ మార్గదర్శకాల ప్రకారం ఆ ఇద్దరు ఉప కలెక్టర్ల బదిలీలు జరిగాయి. అయితే ఎన్నికల ఫలితాలకు నాలుగు రోజుల ముందు ఆర్ఓ బదిలీ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల్లో తాడిపత్రి కూడా ఉండటంతోనే… రాజకీయ ఒత్తిళ్ళు బరించలేక… ఆర్వో రాంభూపాల్ రెడ్డి మెడికల్ లీవ్ లో వెళ్ళిపోయారనే ప్రచారం జరుగుతోంది.

Tadipatri RO Transfer

పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌(పీఏబీఆర్‌) ఉప కలెక్టర్‌గా(ఎస్‌డీసీ) ఉన్న రాంభూపాల్‌రెడ్డి తాడిపత్రి(Tadipatri) ఆర్వోగా పని చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయనను రాష్ట్ర భూపరిపాలన శాఖ(సీసీఎల్‌ఏ) కమిషనర్‌కు రిపోర్టు చేయాలని తాజా బదిలీ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఆయన స్థానంలోకి కోనేరు రంగారావు కమిటీ(కేఆర్‌ఆర్‌సీ) ఉప కలెక్టర్‌ శిరీషను పీఏబీఆర్‌ ప్రత్యేక ఉప కలెక్టర్‌గా బదిలీ చేస్తూ… తాడిపత్రి ఆర్వోగా నియమించారు. ఆమె గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతపురం ప్రత్యేక ఉప కలెక్టర్‌ సి.విశ్వనాథ్‌ నూ బదిలీ చేశారు. ఆయనను కర్నూలు హంద్రీనీవా భూసేకరణ విభాగం ఎస్‌డీసీగా నియమించారు.

Also Read : Telangana State Song: రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’కు ప్రభుత్వం ఆమోదం !

Leave A Reply

Your Email Id will not be published!