Tamilisai Soundara Rajan : మోడీ వల్లే టీమిండియా గెలుపు
గవర్నర్ తమిళి సై సౌందర రాజన్
Tamilisai Soundara Rajan : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్(Tamilisai Soundara Rajan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీసీసీఐ ఆధ్వర్యంలో ప్రస్తుతం భారత్ లో ఐసీసీ వరల్డ్ కప్ 2023 జరుగుతోంది. ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్ లలో సత్తా చాటింది. సెమీ ఫైనల్ కు చేరిన తొలి జట్టుగా చేరింది. భారీ తేడాతో శ్రీలంక జట్టును ఓడించింది. ఈ టోర్నీలో ఇద్దరు సీమర్లు హైదరాబాద్ కు చెందిన మహమ్మద్ సిరాజ్ , మహ్మద్ షమీ అద్భుతంగా బౌలింగ్ చేశారు. కీలకమైన వికెట్లు తీశారు. ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపించారు.
Tamilisai Soundara Rajan Comment
ఇదే సమయంలో భారత జట్టు బ్యాటర్లు అద్బుతంగా రాణించారు. దేశ వ్యాప్తంగా ప్రధాన మంత్రితో పాటు పలువురు టీమిండియా గెలుపొందడాన్ని స్వాగతిస్తున్నారు. రోహిత్ సేన కప్ గెలవాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా భారత జట్టు విజయం సాధించడంపై స్పందించారు తమిళి సై సౌందర రాజన్.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రయత్నం వల్లనే టీం గెలుపొందిందని లేక పోతే గెలిచి ఉండేది కాదని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర గవర్నర్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వ సపోర్ట్ ఉండవచ్చు..కానీ మోదీ వల్లనే టీమిండియా గెల్చిందని చెప్పడం కొంచెం విడ్డూరంగా ఉందని పేర్కొంటున్నారు క్రీడాభిమానులు.
Also Read : TTD EO Dharma Reddy : పద్మావతి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు