TDP Janaena Sand Protest: ఇసుక దోపిడీకి వ్యతిరేకంగా టీడీపీ-జనసేన ఉమ్మడి ఆందోళన !
ఇసుక దోపిడీకి వ్యతిరేకంగా టీడీపీ-జనసేన ఉమ్మడి ఆందోళన !
TDP Janaena Sand Protest: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టడానికి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ దాని కూటమి పార్టీ జనసేనతో సిద్ధమౌతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అధికార వైసీపీ నాయకులు చేసిన ఇసుక దోపిడీకు వ్యతిరేకంగా శనివారం ఒక్కరోజు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ(TDP), జనసేన శ్రేణులు కలిసి ఇసుక అక్రమ దోపిడీపై ఇసుక ర్యాంపుల వద్ద నిరసన తెలియజేస్తున్నట్లు ఏపీ టీడీపీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. వైసీపీ అధికారంలోకి రాగానే టీడీపీ ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేశారని… తన అనుచరులతో ఇసుక మాఫియాను సృష్టించి ఐదేళ్ళలో సీఎం జగన్ రూ. 50 వేల కోట్లు లూటీ చేశారని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్, వైసీపీ నాయకుల ఇసుక దోపిడీను ప్రజలకు వివరించేందుకు టీడీపీ-జనసేన పార్టీలు ఈ ఆందోళన చేపడుతున్నట్లు ఆయన వివరించారు.
TDP Janaena Sand Protest Viral
ఈ సందర్భంగా టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ… ‘‘రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు నిజమేనని తేలుస్తూ వాటికి సంబంధించిన ఫొటోలు, నకిలీ బిల్లుల పుస్తకాలు, తదితర ఆధారాలతో కమిటీ నివేదిక కేంద్ర ప్రభుత్వానికి వెళ్లింది. అయినప్పటికీ జగన్ ఇసుక దోపిడి మాత్రం ఆపటం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా నేతల కనుసన్నల్లో 500కి పైగా రీచ్ ల్లో అక్రమంగా ఈసీలు లేకుండా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. అక్రమ తవ్వకాలు జరిగే ప్రాంతాల్లో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో టీడీపీ-జనసేన ఆందోళనలు నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా ఇరు పార్టీల శ్రేణులు ఇసుక రీచ్ ల వద్ద నిరసనలు తెలియజేస్తాం. వైసీపీ అక్రమ ఇసుక దోపిడీకి సంబంధించిన ఫొటోలు, సెల్ఫీల రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతాం’’ అని ఆయన తెలిపారు.
Also Read : YS Sharmila: అళ్ల రామకృష్ణారెడ్డిపై వైఎస్ షర్మిల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !