IND A vs NZ A 1st ODI : కీవీస్ పై భారత్ – ఎ గ్రాండ్ విక్టరీ
సంజూ శాంసన్ కు అపూర్వ ఆదరణ
IND A vs NZ A 1st ODI : చెన్నైలోని చిదంబరం మైదానంలో న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో భారత జట్టు(IND A vs NZ A 1stODI) ఘన విజయాన్ని నమోదు చేసింది. కేరళ స్టార్ ప్లేయర్ సంజూ శాంసన్ సారథ్యంలో ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది.
ఇంకా రెండు మ్యాచ్ లు జరగాల్సి ఉంది. ఇక శాంసన్ మైదానంలోకి అడుగు పెట్టగానే ప్రేక్షకులు, అభిమానులు పెద్ద ఎత్తున గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు.
శాంసన్ ను టి20 వరల్డ్ కప్ కు ఎంపిక చేయలేదు బీసీసీఐ సెలెక్షన్ కమిటీ.
దీంతో తాజా, మాజీ ఆటగాళ్లతో పాటు సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్ నిప్పులు చెరిగారు. దీంతో తలొగ్గిన సెలెక్షన్ కమిటీ భారత – ఎ జట్టుకు ఏకంగా
కెప్టెన్ గా ఎంపిక చేసింది.
ఫీల్డింగ్ కి ఎంటర్ అయినప్పుడు ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన సమయంలో శాంసన్ కు జేజేలు పలికారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన
వీడియో హల్ చల్ అవుతోంది.
అజేయంగా 29 పరుగులు చేశాడు. జట్టును విజయ పథంలో నడిపించాడు. ఏడు వికెట్ల తేడాతో ఓడించింది కీవీస్ ను. ఇక రెండో, మూడో వన్డే మ్యాచ్ లు
ఇదే వేదికపై ఆదివారం, మంగళవారాల్లో జరగనున్నాయి.
మ్యాచ్ విషయానికి వస్తే మొదట న్యూజిలాండ్ – ఎ జట్టు 40.2 ఓవర్లలో 167 పరుగులకు చాప చుట్టేసింది. శార్దూల్ ఠాకూర్ 8 ఓవర్లు వేసి 32 రన్స్ ఇచ్చి 4
వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ సేన్ 7 ఓవర్లు వేసి 30 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు.
కీవీస్ జట్టులో రిప్పన్ 61 రన్స్ చేస్తే జో వాకర్ 36 పరుగులు చేశారు. అనంతరం బరిలోకి దిగిన భారత – ఎ జట్టు 31 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.
రుతురాజ్ గైక్వాడ్ 41 రన్స్ చేస్తే రాహుల్ త్రిపాఠి 31, రజిత్ పాటిదార్ 45 రన్స్ , సంజూ శాంసన్ 29 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
Also Read : చరిత్ర సృష్టించిన రిజ్వాన్..బాబర్ ఆజం
"Sanju Samson" that's it.pic.twitter.com/XJNDqIv7qo
— Praneesh (@praneeshppr) September 22, 2022