Team India Celebrates : టీమిండియా ‘మేరా భార‌త్ మ‌హాన్’

జెండా పండుగ‌లో భార‌త క్రికెట‌ర్లు

Team India Celebrates : కేఎల్ రాహుల్ నాయ‌క‌త్వంలోని భార‌త క్రికెట్ జ‌ట్టు 76వ స్వాతంత్ర దినోత్స‌వ వేడుక‌ల‌ను ఘ‌నంగా జ‌రుపుకుంది. మూడు వ‌న్డేల సీరీస్ లో భాగంగా జింబాబ్వే టూర్ లో ఉంది.

అక్క‌డే భార‌త ఆటగాళ్లు జాతీయ జెండాను(Team India Celebrates) ఆవిష్క‌రించారు. మేరా భార‌త్ మ‌హాన్ అంటూ నిన‌దించారు క్రికెట‌ర్లు. జాతీయ ప‌తాకం జాతి స‌మైక్య‌త‌కు, ఆత్మ గౌర‌వానికి ప్ర‌తీక అన్నారు భార‌త క్రికెట్ జ‌ట్టు కోచ్ వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్.

ప్ర‌తి ఒక్క‌రు జాతీయ ప‌తాకం ఔన్న‌త్యాన్ని గుర్తు పెట్టుకోవాల‌ని కోరారు. జాతీయ జెండా ఎల్ల‌ప్పుడూ ఆట‌గాళ్ల‌కు స్పూర్తిగా నిలుస్తుంద‌న్నారు.

ఇక ఈ త్రివ‌ర్ణ ప‌తాక వేడుక‌ల్లో జ‌ట్టు స‌భ్యుల‌తో పాటు స‌హాయ‌క సిబ్బంది పాల్గొన్నారు. కాగా రెగ్యుల‌ర్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్ గైర్హాజ‌ర‌య్యారు.

ఆయ‌న స్థానంలో నేష‌న‌ల్ క్రికెట్ అకాడమీ డైరెక్ట‌ర్ గా ఉన్న ల‌క్ష్మ‌ణ్ ను బీసీసీఐ తాత్కాలిక కోచ్ గా ఎంపిక చేసింది. ఇక స్వ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు కోచ్ ల‌క్ష్మ‌ణ్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగాయి.

భార‌తీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించిన అనంత‌రం భార‌త క్రికెట‌ర్లు అంతా జెండా ముందు నిల‌బ‌డి ఫోటోలు దిగారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

ఇదిలా ఉండ‌గా 2016 త‌ర్వాత భార‌త క్రికెట్ జ‌ట్టు జింబాబ్వేలో ప‌ర్య‌టిస్తోంది. ఈ టూర్ లో భాగంగా టీమిండియా ఆగ‌స్టు 18, 20, 22 తేదీల‌లో మూడు వ‌న్డేలు ఆడ‌నుంది.

ఈ ప‌ర్య‌ట‌న అనంత‌రం భార‌త జ‌ట్టు ఆట‌గాళ్లు నేరుగా యూఏఈలో ఈనెల 27 నుంచి జ‌రిగే ఆసియా క‌ప్ లో పాల్గొంటుంది. ఇందులో కొంద‌రు తిరిగి ఇండియాకు విచ్చేస్తారు.

Also Read : కోహ్లీ ఫామ్ లోకి వ‌స్తే క‌ష్టం – స‌ల్మాన్ భ‌ట్

Leave A Reply

Your Email Id will not be published!