Rahane Pujara : ఆ ఇద్ద‌రూ లేకుండానే బ‌రిలోకి

అజింక్యా ర‌హానే..చ‌తేశ్వ‌ర్ పుజారా

Rahane Pujara : భార‌త క్రికెట్ జ‌ట్టు శ్రీ‌లంక‌తో టెస్టు మ్యాచ్ ఆడేందుకు స‌న్న‌ద్ద‌మైంది. వ‌రుస విజ‌యాల‌తో స‌త్తా చాటుతున్న రోహిత్ సేన (Rahane Pujara)రెడీ అయ్యింది.

అయితే కొన్నేళ్లుగా టీమిండియాను టాప్ లో నిలిచేలా చేసిన ఆటగాళ్ల‌లో వాళ్లిద్ద‌రూ వెరీ వెరీ స్పెష‌ల్. కానీ గ‌త కొంత కాలంగా ఫామ్ లేమితో కొట్టు మిట్టాడుతుండ‌డంతో భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి – బీసీసీఐ సెలక్ష‌న్ క‌మిటీ అనూహ్యంగా ప‌క్క‌న పెట్టింది.

ఆ ఇద్ద‌రూ ఎవ‌రో కాదు అజింక్యా ర‌హానే, చ‌తేశ్వ‌ర్ పుజారా. ప్ర‌త్యేకంగా భార‌త జ‌ట్టు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ మ్యాచ్ ప్రారంభం కంటే ముందు మీడియాతో మాట్లాడాడు.

త‌మ జ‌ట్టులో వాళ్లిద్ద‌రూ లేకుండా ఆడ‌డం త‌న‌ను ఎంత‌గానో బాధ‌కు గురి చేసింద‌ని చెప్పాడు. ఒక ర‌కంగా తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యాడు కూడా. ఎందుకంటే వాళ్లిద్ద‌రూ ఆట‌లోనే కాదు వ్య‌క్తిత్వంలోనూ అద్భుత‌మైన వ్య‌క్తులు.

ప్ర‌త్యేకించి అజింక్యా ర‌హానే (Rahane Pujara)గురించి చెప్పుకోవాలి. కోహ్లీ త‌ప్పుకున్న స‌మ‌యంలో ర‌హానే భార‌త జ‌ట్టుకు విజ‌యాలు సాధించి పెట్టాడు. అత‌డి నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు భిన్నంగా ఉంటాయి.

స‌ఫారీ టూర్ సంద‌ర్భంగా ర‌హానే, ఛ‌తేశ్వ‌ర్ పుజారా ఇద్ద‌రూ ఆశించిన మేర ఆడ‌లేక పోయారు. దీంతో బీసీసీఐ చీఫ్ సౌర‌వ్ గంగూలీ ఇద్ద‌రూ దేశీవాలీ క్రికెట్ లో ఆడి మ‌ళ్లీ స‌త్తా చాటాల‌ని అప్పుడు టీంలోకి తీసుకునే ప్ర‌య‌త్నం చేస్తామ‌ని స్ప‌ష్టం చేశాడు.

దాదా చెప్పిన‌ట్టుగానే ర‌హానే, పుజారా రంజీ ట్రోఫీలో ఆడారు. ఇద్ద‌రూ సెంచరీలు సాధించినా సెలక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ చేత‌న్ శ‌ర్మ ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదు.

మొత్తంగా ఈ దిగ్గ‌జ ఆట‌గాళ్లు లేకుండానే టెస్టు మ్యాచ్ ఆడేందుకు టీమిండియా స‌మాయ‌త్తం కావ‌డం కెప్టెన్ రోహిత్ శ‌ర్మ తో పాటు క్రీడాభిమానులు బాధ‌కు లోన‌వుతున్నారు.

Also Read : కోహ్లీ మెరిసేనా సెంచ‌రీ సాధించేనా

Leave A Reply

Your Email Id will not be published!