IND vs SL T20 : రోహిత్ సేన ఊపు మీదుంది. ఇప్పటికే వెస్టిండీస్ ను మట్టి కరిపించిన భారత జట్టు రెట్టించిన ఉత్సాహంతో లంకేయులతో ఆడేందుకు సిద్దమైంది. లక్నో వేదికగా టీమిండియా లంకేయులతో టీ20 మ్యాచ్ ఆడనుంది.
అన్ని ఫార్మాట్ లలో బలంగా ఉన్న రోహిత్ టీం ఢీకొట్టేందుకు, సత్తా చాటేందుకు రెడీ గా ఉంది. పరిమిత ఓవర్ల మ్యాచ్ లలో పూర్తిగా విండీస్ పై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చింది భారత జట్టు.
ఇక శ్రీలంక జట్టు ఆస్ట్రేలియా టూర్ లో పేలవమైన ప్రదర్శన చేసింది. కోల్పోయిన పరువును ఎలాగైనా భారత్ తో జరిగే మ్యాచ్ లలో సత్తా చాటాలని చూస్తోంది.
రాబోయే వరల్డ్ కప్ పై కన్నేసిన రోహిత్ శర్మ , హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్(IND vs SL T20) జట్టులో మరిన్ని ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. జట్టు కుదట పడేంత వరకు ఈ ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయని స్పష్టం చేశాడు రాహుల్ ద్రవిడ్.
ఇందుకు రోహిత్ కూడా ఓకే చెప్పడం విశేషం. సుదీర్ఘ కాలం పాటు నాయకత్వం వహించిన విరాట్ కోహ్లీ పై ఎలాంటి వత్తిడి లేక పోవడంతో పూర్తిగా ఆటపై ఫోకస్ పెట్టాడు.
ఇది జట్టుకు అదనపు బలం అని చెప్పక తప్పదు. ఇక వరల్డ్ కప్ కు ముందు సాధ్యమైనన్ని మ్యాచ్ లు ఆడాలని ఉవ్విళ్లూరుతో టీమిండియా. దీని వల్ల మరింత ప్రాక్టీస్ జట్టుకు లభిస్తుందని కోచ్ భావన.
అందుకు తగ్గట్టుగానే బీసీసీఐ పలు మార్పులు చేస్తోంది. ఆశించిన స్థాయి కంటే ఎక్కువ మంది ఆటగాళ్లను తీసుకుంది సెలక్షన్ కమిటీ. ఇవాళ జరిగే మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనేది వేచి చూడాల్సిందే.
Also Read : సాహా బాధ నిజం జట్టులో చోటు కష్టం