Team India : ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మృతి పట్ల భారత క్రికెట్ జట్టు ( Team India)నివాళి అర్పించింది. నల్ల బ్యాండ్లు ధరించారు. ఆమె పట్ల తమకు ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు.
ఇవాళ విండీస్ తో జరిగే మ్యాచ్ సందర్భంగా అహ్మదాబాద్ మైదానంలో నల్ల బ్యాండ్ లు ధరించారు భారత క్రికెటర్లు. ఆమెకు క్రికెట్ అంటే అభిమానం. మెలోడీ క్వీన్ లేరన్న బాధ మమ్మల్ని బాధకు గురి చేసింది.
విజయం సాధించిన ప్రతిసారీ మద్దతు ఇస్తూ వచ్చారు. క్రికెట్ ఆటను ప్రేమించడమే కాదు మద్దతు ఇస్తూ వచ్చారని భారత క్రికెట్ నియంత్రణ మండలి – బీసీసీఐ ట్వీట్ చేసింది.
టీమిండియా ఆటగాళ్లు తమ చేతికి నల్ల బ్యాండ్ లు ధరించనున్నట్లు ధ్రువీకరించారు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా. కరోనా కారణంగా 29 రోజులుగా ముంబై లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశారు.
ఆమెకు ఇప్పుడు 92 ఏళ్లు. కొన్ని తరాల పాటు పాడుతూ వచ్చారు. 20 భాషలలో 50 వేలకు పైగా పాటలు పాడారు. ఇదిలా ఉండగా ఆమె గౌరవార్థం కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది.
ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని అవనతం చేస్తారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతున్నారు. ఆమెకు నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్నారు.
ఇదిలా ఉండగా బీసీసీఐ( Team India) తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఆమె మరణం దేశానికే కాదు క్రికెట్ కు పెద్ద లోటుగా పేర్కొంది.
Also Read : బౌలర్లు భళా ఇంగ్లండ్ విలవిల