Telangana BJP List : బీజేపీ బీసీల జ‌పం

సామాజిక న్యాయం పాటిస్తాం

Telangana BJP List : తెలంగాణ – రాష్ట్రంలో ప‌వ‌ర్ లోకి రావాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్న బీజేపీ(BJP) ఉన్న‌ట్టుండి ఇంకా లిస్టు ఖ‌రారు చేయ‌లేదు. త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తాని ఆ పార్టీ ఎంపీ ల‌క్ష్మ‌న్ ప్ర‌క‌టించారు. తొలి విడ‌త‌లో 55 మందికి సీట్లు కేటాయిస్తామ‌ని ప్ర‌క‌టించారు. భారీగానే క‌స‌ర‌త్తు చేశారు. ఇవాళ లేదా రేపు క‌చ్చితంగా అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేస్తామంటూ స్ప‌ష్టం చేశారు.

Telangana BJP List Viral

ఆల్ రెడీ జాబితా పూర్త‌యింద‌న్నారు. ఏ క్ష‌ణం లోనైనా ఖ‌రారు ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు. ఇదిలా ఉండ‌గా అభ్య‌ర్థుల ఎంపిక‌కు సంబంధించి సామాజిక న్యాయం పాటిస్తామ‌ని పేర్కొన్నారు. ఇందులో మ‌హిళ‌లు, బీసీల‌కు పెద్ద పీట వేస్తామ‌ని చెప్పారు. ల‌క్ష్మ‌ణ్ మీడియాతో మాట్లాడారు.

తొలి లిస్టులో వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తులకు 33 సీట్లు కేటాయిస్తామ‌ని చెప్పారు. బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన వ్య‌క్తినే తాము ముఖ్య‌మంత్రిని చేస్తామ‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు ల‌క్ష్మ‌ణ్. బీసీ నినాదంతోనే తాము ఎన్నిక‌ల్లో ముందుకు వెళ‌తామ‌ని తెలిపారు.

రాష్ట్రంలో ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్నార‌ని, కాషాయం జెండా ఎగుర వేయ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు. మొత్తం 119 సీట్ల‌కు గాను త‌మ‌కు 60 సీట్ల‌కు పైగా వ‌స్తాయ‌న్న న‌మ్మ‌కం త‌మ‌కు ఉంద‌న్నారు.

Also Read : Pawan Kalyan : ఏపీకి కాబోయే సీఎంను నేనే – ప‌వ‌న్

Leave A Reply

Your Email Id will not be published!