Telangana Budget 2023 : తెలంగాణ బడ్జెట్ రూ. 2,90,396 కోట్లు
ప్రజా సంక్షేమానికి పెద్దపీట
Telangana Budget 2023 : అసెంబ్లీలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం 2023-24 సంవత్సరానికి గాను బడ్జెట్ ను(Telangana Budget 2023) ప్రవేశ పెట్టింది. ఈ బడ్జెట్ లో ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేసింది. ఈ ఏడాదికి గాను రాష్ట్ర బడ్జెట్ ను రూ. 2,90,396 కోట్లు గా కేటాయించింది. ఇందులో రెవిన్యూ వ్యయం రూ. 2,11, 685 కాగా పెట్టుబడి కింద ఖర్చు రూ. 37,525 కోట్లు అని ప్రకటించారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి.
ఇందులో ప్రధాన రంగాలకు ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చింది. వ్యవసాయ శాఖకకు రూ. 26,831 కోట్లు , ఆయిల్ పామ్ సాగు కోసం రూ. 1,000 కోట్లు, నీటి పారుదల రంగానికి రూ. 26,885 కోట్లు , విద్యుత్ రంగానికి రూ. 12, 727 కోట్లు కేటాయించింది. ఇక ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం రూ. 3,177 కోట్లు , ఆసరా పెన్షన్ల కోసం రూ. 12,000 కోట్లు, దళిత బంధు పథకానికి రూ. 17,700 కోట్లు , అటవీ శాఖ , హరితహారం పథకానికి రూ. 1,471 కోట్లు , విద్యా శాఖకు రూ. 19,093 కోట్లు కేటాయింపు చేసింది.
వైద్య రంగానికి రూ. 12,161 కోట్లు , పంచాయతీరాజ్ శాఖకు రూ. 31,426 కోట్లు , ఎస్సీల ప్రగతికోసం రూ. 36,750 కోట్లు , ఎస్టీల ప్రగతి కోసం రూ. 15,233 కోట్లు , బీసీ సంక్షేమం కోసం రూ . 6,229 కోట్లు , మహిళా సంక్షేమం కోసం రూ. 2,131 కోట్లు , మైనార్టీల సంక్షేమం కోసం రూ. 2,200 కోట్లు , కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కు రూ. 3,210 కోట్లు కేటాయించింది రాష్ట్ర సర్కార్.
ఇక పల్లె ప్రగతి..పంచాయతీరాజ్ శాఖకు రూ. 31,426 కోట్లు , పురపాలిక శాఖకు రూ. 11,372 కోట్లు ,రోడ్లు భవనాలకు రూ. 2,500 కోట్లు కేటాయించింది.
Also Read : బడ్జెట్ లో ప్రజా సంక్షేమానికి పెద్దపీట