Telangana Cabinet: ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం

ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం

Telangana Cabinet : ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి(CM revanth Reddy) అధ్యక్షతన నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో న్యాయపరమైన చిక్కులు లేకుండా తుది మెరుగులు దిద్దాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణా కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్‌ సమావేశాల నిర్వహణ, ఆ సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై ఈ భేటీలో చర్చించినట్టు సమాచారం. యాదగిరిగుట్ట దేవస్థాన బోర్డుకు సంబంధించి ఎండోమెంట్‌ సవరణ బిల్లును కూడా క్యాబినెట్‌ లో చర్చించి ఆమోదించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Telangana Cabinet Approves

మాల, మాదిగ, డక్కలి.. ఇలా తెలంగాణలో 59 ఎస్సీ కులాలు ఉన్నాయి. ఆ జాబితాలోని కులాలకు ప్రభుత్వ విద్య, ఉద్యోగాల్లో కొంత శాతం వరకు రిజర్వేషన్ ఉంటుంది. తెలంగాణలో అది 15 శాతం ఉంది. అంటే వందలో 15 ఉద్యోగాలు ఈ కులాలకు చెందిన వారికే ఇస్తారు. అయితే, ఆ జాబితాలోని కులాల మధ్య కూడా అసమానతలు ఉన్నాయి. అందులో కొన్ని కులాలు ముందున్నాయి, మరి కొన్ని కులాలు వెనుకబడి ఉన్నాయని ఆయా కులాల వారు చెబుతూ వచ్చారు. దీనివల్ల ఎస్సీలకు మొత్తంగా ఇచ్చిన రిజర్వేషన్లను కొన్ని కులాలే ఉపయోగించుకుని ముందుకు వెళ్తున్నాయనీ, మిగతా వారు వెనుకబడే ఉంటున్నారనీ ఇతర కులాల వారు ఆరోపిస్తూ వస్తున్నారు.

అందుకే ఎస్సీలకు ఇచ్చిన 15 శాతం రిజర్వేషన్‌ను తిరిగి, కులాల మధ్య విభజించి పంచాలనే డిమాండ్ వినిపించింది. ప్రధానంగా రిజర్వేషన్ ఫలితాలు మాలలు వారు ఎక్కువ అనుభవించారు కాబట్టి, ఎస్సీ కులాలను వర్గీకరణ జరపాలంటూ మాదిగలు పోరాడారు. మందకృష్ణ మాదిగ తెలుగునాట ఆ పోరాటంలో ముందు ఉండి అందరిని నడిపించారు.

Also Read : Rahul Gandhi: సావర్కర్ కేసులో రాహుల్‌ గాంధీకి జరిమానా విధించిన కోర్టు

Leave A Reply

Your Email Id will not be published!