Telangana Cabinet Meeting: ఈ నెల 21న తెలంగాణా క్యాబినెట్‌ సమావేశం !

ఈ నెల 21న తెలంగాణా క్యాబినెట్‌ సమావేశం !

Telangana Cabinet Meeting: ఈ నెల 21న రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశాన్ని సచివాలయంలో నిర్వహించనున్నారు. ఇందులో ప్రధానంగా అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు, ఆగస్టు 15 నాటికి అమలు చేయబోయే పంట రుణాల మాఫీ పథకంపై చర్చించనున్నారు. రుణ మాఫీ పథకం అమలుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అవసరమైన నిధులను సేకరణపై దృష్టి పెట్టిన ప్రభుత్వం, విధి విధానాలను కూడా ఖరారు చేయబోతోంది. పథకానికి ఎప్పటి నుంచి కట్‌ ఆఫ్‌ డేట్‌ను నిర్ణయించాలి, ఇంకా ఎలాంటి నిబంధనలు విధించాలన్నదానిపై కసరత్తు చేస్తోంది. దీనిపై క్యాబినెట్‌ భేటీలో కూలంకషంగా చర్చించి, మంత్రుల అభిప్రాయాలను కూడా తెలుసుకోనుంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను నిర్వహించాల్సి ఉన్నందున ప్రారంభ తేదీని ఖరారు చేయనుంది. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఫిబ్రవరిలో జరిగాయి. వీటితో పాటు ఇతర అంశాలు చర్చకు రానున్నాయి.

Telangana Cabinet Meeting..

ఈ నెల 6వ తేదీ వరకు లోక్ సభ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో… ఎన్నికల కమీషన్ అనుమతితో కేబినెట్ సమావేశం నిర్వహించాల్సి వచ్చింది. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున కొత్త పథకాలు, కొత్త ప్రాజెక్టుల విషయంలో కేబినెట్ లో చర్చించడానికి అవకాశం లేకపోయింది. ఈ నేపథ్యంలో ఈ నెల 21న జరగబోయే మంత్రి మండలి సమావేశంపై ఆశక్తి నెలకొంది. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) సహా మంత్రి మండలి సభ్యులు పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

Also Read : PM Narendra Modi: కశ్మీర్‌లో ప్రధాని మోదీ యోగా ! 7 వేల మంది పాల్గొనేలా ఏర్పాట్లు !

Leave A Reply

Your Email Id will not be published!