Telangana Congress CM Comment : విజయం సరే ‘విజేత’ ఎవరో
కాంగ్రెస్ లో సీఎం పంచాయతీ
Telangana Congress : దేశ వ్యాప్తంగా 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నా కేవలం తెలంగాణపై మాత్రమే ఎక్కువగా ఫోకస్ ఉంటోంది. దీనికి ప్రధాన కారణం టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చేసి జనం నెత్తిన శఠగోపం పెట్టిన చరిత్ర సీఎం కేసీఆర్ ది. ప్రస్తుతం ఆయన శాసన సభ ఎన్నికల్లో ఎదురీదుతున్నారని చెప్పక తప్పదు. గతంలో ఎన్నడూ లేనంతగా ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. పైకి ఎన్ని సర్వేలు గులాబీ తిరిగి పవర్ లోకి వస్తుందని చెబుతున్నా గ్రౌండ్ లెవల్లో మాత్రం అందుకు వ్యతిరేకంగా ఉంది. తొమ్మిదిన్నర ఏళ్లుగా పాలన సాగించిన గులాబీ బాస్ ఏరోజూ ప్రజలను నేరుగా కలిసింది లేదు. విన్నపాలు విన్నదీ లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా టైమ్ ఇవ్వరన్న అపవాదు ఆయనకు ఉంది. ఎంత సేపు తాను చెప్పింది చెప్పేసి వెళ్లి పోవడం, అదేమని ప్రశ్నిస్తే నోరు పారేసు కోవడం చేస్తూ వచ్చారు. చివరకు ఫామ్ హౌస్ కేరాఫ్ గా పాలనకు మారడం దౌర్భాగ్యం కాక మరేమిటి.
Telangana Congress CM Issues Viral
తాను ఏది చెబితే ప్రజలు అదే నమ్ముతారనే భ్రమలో ఉండడం ఒకింత విస్తు పోయేలా చేస్తోంది . మరో వైపు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసిస్తున్నారు. గతంలో కంటే ఈసారి గట్టి పోటీ ఇస్తోంది . అధికార పార్టీకి ముచ్చెమటలు పోయిస్తోంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. కేసీఆర్ సభలలో ప్రసంగాలు జోష్ నింపడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇక సోషల్ మీడియాలో ఎంత గొప్పగా ప్రచారం చేసినా ఇప్పటి వరకు ప్రభుత్వం ఎందుకు ఉద్యోగాలను భర్తీ చేయలేదన్న ప్రధాన అంశాన్ని కాంగ్రెస్(Telangana Congress) విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లడంలో సక్సెస్ అయ్యింది. మరో వైపు బీజేపీ, ఎంఐఎం, బీఆర్ఎస్ ఒక్కటేనని ముందు నుంచీ నెత్తీ నోరు మొత్తుకుంటోంది కాంగ్రెస్(Telangana Congress) పార్టీ. తొలుత కాదని బుకాయించినా చివరకు బహిరంగంగానే మద్దతు పలికారు ఎంఐఎం చీఫ్ ఓవైసీ. కేసీఆర్ వల్లనే ఇవాళ రాష్ట్రం అభివృద్ది చెందిందని కితాబు కూడా ఇచ్చేశారు. కానీ ఆ పార్టీ కూడా ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది.
జనం ఎక్కువ కాలం ఏ పార్టీని నమ్మరని ఇప్పటికే తేలి పోయింది. తనకు ఎదురే లేదని అహంకారంతో విర్ర వీగిన దివంగత నందమూరి తారక రామారావును కల్వకుర్తిలో ఓడించారు. ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడ్రస్ లేకుండా పోయాడు. తెలంగాణ ను కించ పరిచిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చివరకు కమలం గూటికి చేరాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో అడ్రస్ లేకుండా పోయారు. ఇది పక్కన పెడితే ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే ఛాన్స్ ఉందని ఆ పార్టీ నమ్ముతోంది.
బలంగా విశ్వసిస్తోంది కూడా. ప్రజా వ్యతిరేకత తమను గట్టెక్కిస్తుందని ఆశిస్తోంది. ఇంకా ఎన్నికలు పూర్తి కానే లేదు. సీఎం కుర్చీ కోసం మాటల యుద్దం కొనసాగుతోంది. అర డజను మంది సీఎం రేసులో ఉన్నారు. వీరిలో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లలో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజ నరసింహ, మధు యాష్కి గౌడ్ , షబ్బీర్ అలీ, జగ్గా రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క పేర్లు ఉన్నాయి. మరి వెరి వైపు మొగ్గుచూపుతుందనేది ఉత్కంఠ రేపుతోంది. కర్ణాటక ఫార్ములా ఇక్కడ అమలు చేస్తుందా లేక తాము చెప్పినట్లు నడుచుకునే వాళ్లకే సీటు కేటాయిస్తుందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
Also Read : Rahul Gandhi Tour : తెలంగాణలో రాహుల్ పర్యటన