Telangana Congress Comment : జనమే జనం కానుందా ‘హస్తం’
జోరు మీదున్న కారు..వెనుకంజలో కారు
Telangana Congress Comment : డెడ్ లైన్ ముగిసింది. అసలైన యుద్దం మొదలైంది. రోజులు దగ్గర పడుతున్నాయి. నవంబర్ 30న పోలింగ్ కొనసాగనుంది. ఎవరు గెలుస్తారనే దానిపై చర్చ కొనసాగుతోంది. దేశంలోని 5 రాష్ట్రాలలో శాసన సభ ఎన్నికలు జరుగుతున్నాయి. వచ్చే జనవరి నెల లోపు అన్ని రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఫలితాలు వెల్లడించనుంది. ప్రధానంగా జాతీయ స్థాయిలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ స్వంతం చేసుకున్న బీఆర్ఎస్ బాస్, తెలంగాణ సీఎం కేసీఆర్ కు అగ్ని పరీక్షగా మారింది. తన జీవితంలో అత్యంత గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. కోట్లాది మందిని తెలంగాణ ఉద్యమ నినాదం వైపు చూసేలా చేసిన ఘనుడు. ప్రతిపక్షాలను తక్కువ అంచనా వేస్తూ వచ్చిన కేసీఆర్ నోటి వెంట ఉన్నట్టుండి ఊహించని మాటలు వస్తుండడం విస్తు పోయేలా చేసింది.
Telangana Congress Comment Viral
ఈ తరుణంలో ప్రభంజనంలా దూసుకు వచ్చింది కాంగ్రెస్(Congress) పార్టీ. మొన్నటి దాకా గట్టి పోటీ ఇస్తుందని అనుకున్న భారతీయ జనతా పార్టీ వెనుకంజ వేసింది. ఈ సమయంలో పార్టీ పరంగా అధ్యక్షుడిని మార్చడం బిగ్ షాక్ ఇచ్చేలా చేసింది. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ గా కొలువు తీరాడో ఆనాటి నుంచి హస్తానికి పరపతి పెరిగింది. జనంలో ఆదరణ నెలకొంది. కానీ దీనికి ప్రధాన కారణం కర్ణాటకలో ఉన్నట్టుండి కాంగ్రెస్ అధికారంలోకి రావడం. ఆ ప్రభావం తెలంగాణపై పడింది.
ఇది కూడా మరింత ప్రజల్లోకి తీసుకు వెళ్లేలా చేయడంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు. తన టీం పెద్ద ఎత్తున గత కొంత కాలం నుంచి తెలంగాణలో పని చేస్తూ వచ్చింది. మరో వైపు బీఆర్ఎస్ , బీజేపీకి ధీటుగా సోషల్ మీడియాలో కాంగ్రెస్(Congress) పార్టీ దూసుకు పోయేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు.
తాజాగా 300 మందితో రంగంలోకి దిగనున్నారు. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి పదేళ్లవుతోంది. భారీ ఎత్తున అవినీతి, అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గత ఎన్నికలలో కంటే ఈసారి జరగబోయే ఎన్నికల్లో విమర్శలు ఎదుర్కొంటుండడం ఇబ్బందికరంగా మారింది. ఎక్కడ చూసినా ప్రభుత్వ వ్యతిరేకత మరింత పెరిగింది. ఇది బిగ్ షాక్ కలిగించింది. వందల కోట్ల ఆస్తులు ఎమ్మెల్యేలు, మంత్రులకు ఉండడాన్ని ప్రజలు ఈసడించుకుంటున్నారు.
అయితే బీఆర్ఎస్ మాత్రం ఎలాగైనా సరే పవర్ లోకి రావాలని అనుకుంటోంది. ఇక సర్వే సంస్థలు గంప గుత్తగా గులాబీకే ఛాన్స్ ఉందని పేర్కొంటున్నాయి. కానీ గ్రామీణ ప్రాంతాలలో చూస్తే పూర్తిగా భిన్నంగా ఉంది. దాడులు, దౌర్జన్యాలు, అక్రమాలు, కేసులు పెరిగి పోయాయని, దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోయిందని వాపోతున్నారు. రెండు సార్లు అవకాశం ఇచ్చామని కానీ ఈసారి ఒక్కసారి వేరే పార్టీకి ఇద్దామనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మొత్తంగా ప్రతి పార్టీకి జనం భారీ ఎత్తున వస్తున్నారు. మరి అధికారం హస్తం పరం కానుందా అన్నది ఉత్కంఠ రేపుతోంది.
Also Read : V Hanumantha Rao : ముందు గెలుద్దాం తర్వాత సీఎం