Congress Manifesto Comment : అభయ హస్తం ఖజానాకు భారం
కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రజలకు శాపం
Congress Manifesto Comment : అన్నీ ఫ్రీగా ఇచ్చేసుకుంటూ పోతే మిగిలేది ఖాళీ ఖజానానే. అధికారంలోకి రావాలన్న ఒకే ఒక్క అజెండా పెట్టుకుని తయారు చేసిన కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదలైంది. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఉంది. కానీ ప్రధానంగా గత కొన్నేళ్లుగా తెలంగాణ ఉద్యమం నుంచి నేటి దాకా, ఉమ్మడి ఏపీ రాష్ట్రం లో సైతం కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్దతిన పని చేస్తూ వచ్చిన వేలాది మంది గురించి ఊసే లేదు. ప్రతి ఒక్క వర్గాన్ని సంతృప్తి పరిచే విధంగా ఉన్నప్పటికీ వీటిని ఇవ్వాలంటే కనీసం లక్ష కోట్లకు పైగా బడ్జెట్ కావాల్సి ఉంటుంది. ఇప్పటికే బిశ్వాల్ కమిటీ 2 లక్షలకు పైగా జాబ్స్ ఉన్నాయని నివేదిక సమర్పించారు. కానీ కేసీఆర్ సర్కార్ చేయలేక చేతులెత్తేసింది. ఇక ఎన్నికలను పురస్కరించుకుని ఆయా పార్టీలు లెక్కకు మించి హామీలు ఇచ్చుకుంటూ వెళుతున్నాయి. గత ఎన్నికల్లో నిరుద్యోగ భృతి ఇస్తానన్న కేసీఆర్ మాట తప్పాడు.
Congress Manifesto Comment Viral
పేదలు, మధ్య తరగతి, బడుగు బలహీన, మైనార్టీ వర్గాలను దృష్టిలో పెట్టుకుని తయారు చేసిన మేనిఫెస్టో ఒకింత ఆనందం కలిగించినా ఒకవేళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే గనుక తలకు మించిన భారం అవుతుందని చెప్పక తప్పదు. దొర చేసిన అప్పే తడిసి మోపడెవుతోంది. ఇప్పటికే లక్షా 20 వేల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా డ్యామేజ్ దిశకు చేరుకోవడం, ఒక రకంగా ప్రజా ధనం నీళ్ల పాలు చేశారన్న విమర్శలు లేక పోలేదు. ఇప్పటికే నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో పవర్ లోకి వచ్చిన నయా నిజాం నవాబు కేసీఆర్ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశాడు. అడుగడుగునా బెల్టు షాపులను ఏర్పాటు చేసి కేవలం తాగుడు ద్వారానే అత్యధిక ఆదాయం వచ్చేలా చేయడం సిగ్గు పడాల్సిన విషయం.
ఇక కాంగ్రెస్(Congress) పార్టీ విడుదల చేసిన మేని ఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు కావాలంటే కోట్లాది రూపాయలు కావాల్సి ఉంటుంది. వీటిని ఎలా , ఎక్కడి నుంచి తీసుకు వస్తారనేది చెప్పలేదు. పరిశ్రమల ఏర్పాటు , ఉపాధి కల్పన, మౌలిక సదుపాయల గుర్తింపు పై ఎక్కడా ప్రస్తావించ లేదు. అంతులేని అవినీతి, అక్రమాలకు పాల్పడిన కల్వకుంట్ల కుటుంబాన్ని జైలు పాలు చేస్తారా. లేక వారు దోచుకున్న దాని నుంచి ప్రజలకు పంచుతారా అన్నది వేచి చూడాలి. ఖజానాపై పెను భారం పడనుంది. దీని నుంచి ఎలా జనాన్ని రక్షిస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇప్పటికే అధికారం నుంచి పదేళ్ల పాటు దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు , ప్రజా ప్రతినిధులు ఎలా సేవలు అందజేస్తారనేది కూడా ఒకింత ఆశ్చర్యంగా ఉంది. మొత్తంగా అభయ హస్తం జనం నెత్తిన శఠ గోపం పెట్టకుండా ఉంటే చాలు అన్నది సామాన్యుల అభిప్రాయం.
Also Read : Amit Shah : రేపే ట్రబుల్ షూటర్ రాక