Telangana Election Commission : ఈసీ సంచలన నిర్ణయం
ఉదయం 5.30 గంటలకే మాక్ పోలింగ్
Telangana Election Commission : హైదరాబాద్ – తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది బుధవారం. ఈసారి ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ను సాయంత్రం 5.30 గంటల వరకు మాత్రమే నిర్ణయించినట్లు తెలిపింది.
Telangana Election Commission Decision
అంతే కాకుండా ఓటు వేయలేని వారు ఎవరైనా ఉంటే వారి తరపున వచ్చే వారికి పర్మిషన్ ఇస్తామని తెలిపింది. అయితే వచ్చే వారు అదే బూత్ కు చెందిన వారుండాలని స్పష్టం చేసింది. తాను ఓటు వేసిన తర్వాతే వేరొకరికి అసిస్టెంట్ గా వెళ్ల వచ్చని పేర్కొంది.
ఈసారి ఉదయం 5.30 గంటల వరకే మాక్ పోలింగ్ ప్రారంభం అవుతుందని ఈసీ(Telangana Election Commission) స్పష్టం చేసింది. ఇంకో వెసులుబాటు కల్పించినట్లు తెలిపింది. గతంలో పోలింగ్ ఏజెంట్లుగా సర్పంచ్ , వార్డు సభ్యులకు ఛాన్స్ ఉండేది కాదు. కానీ ఈసారి వారికి కూడా అవకాశం కల్పించినట్లు తెలిపింది. ఈ విషయాన్ని సర్పంచ్ లు, వార్డు మెంబర్లు గమనించాలని సూచించింది.
ఇదిలా ఉండగా ఈనెల 3న గెజిట్ ప్రకటించింది. దరఖాస్తులను అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తోంది. నవంబర్ 30 రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తామని వెల్లడించారు ఈసీ సీఇఓ వికాస్ రాజ్.
Also Read : Seethakka MLA : ప్రజలే నా బలం బలగం