Telangana Government: తెలంగాణలో మూడు గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ ! జీవో విడుదల !
తెలంగాణలో మూడు గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ ! జీవో విడుదల !
Telangana Government : అంబేద్కర్ జయంతి రోజున ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ వర్గీకరణలో భాగంగా రాష్ట్రంలోని 56 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా విభజించింది. ఈ మేరకు ఎస్సీ వర్గీకరణ(SC Classification) అమలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ జీవో తొలి కాపీనీ మంత్రులు సీఎం రేవంత్ రెడ్డికి సచివాలయంలో అందజేశారు. దీనితో దేశంలో ఎస్సీ వర్గీకరణను అమలులోనికి తీసుకువచ్చిన మొదటి రాష్ట్రంగా తెలంగాణా రికార్డుకెక్కింది. ఇక, మూడు గ్రూపుల విభజన, రిజర్వేషన్లు విషయానికి వస్తే… గ్రూప్-ఏలో ఉన్న వారికి ఒక్క శాతం రిజర్వేషన్, గ్రూప్-బీలో ఉన్న వారికి 9 శాతం రిజర్వేషన్, గ్రూప్-సీలో ఉన్న వారికి 5 శాతం రిజర్వేషన్ ఇవ్వనుంది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడుతూ… ఎస్సీ వర్గీకరణతో మూడు దశాబ్దాల పోరాట ఆకాంక్షలు నెరవేరుస్తున్నాం. విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో బడుగులకు రిజర్వేషన్ల కల్పనకు చర్యలు తీసుకుంటాం. యంగ్ ఇండియా స్కూళ్ల ద్వారా నాణ్యమైన విద్య అందించే సంకల్పంతో ముందుకు సాగుతున్నాం. రైతులు, రైతు కూలీలకు ఎకరాకు రూ.12 వేల ఆర్థిక భరోసా ఇస్తున్నాం. పేదల ఆత్మగౌరవ ప్రతీకగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించాం. రైతు, పేద భూమికి హక్కుపై భరోసా ఇస్తూ భూభారతికి శ్రీకారం చూడుతున్నామని అన్నారు.
Telangana Government – అప్పటి నోటిఫికేషన్ లకు ఎస్సీ రిజర్వేషన్లు వర్తించవు: ఉత్తమ్
ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ జీవో తొలి కాపీనీ మంత్రులు సీఎం రేవంత్ రెడ్డికి(CM Revanth Reddy) సచివాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో మంత్రులతో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ‘ఎస్సీ రిజర్వేషన్లపై ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అమలు అవుతాయి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కు లోబడి ఎస్సీ రిజర్వేషన్లు అమలు అవుతాయి. ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ల పై అందరికీ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నాం. తెలంగాణలో విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణ అమలు చరిత్రాత్మకమైనదని చెప్పుకొచ్చారు. అంబేద్కర్ జయంతి రోజు నుంచే ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్లు అమలవుతాయని స్పష్టం చేశారు. త్వరలోనే అన్ని నోటిఫికేషన్లు ఎస్సీ రిజర్వేషన్ల అమలుతో విడుదల అవుతాయని తెలిపారు. ఇదే సమయంలో గత ఏడాది ఫస్ట్ ఆగస్టు కు ముందు ఇచ్చిన నోటిఫికేషన్లకు ఈ రిజర్వేషన్లు వర్తించవు అని కార్లిటీ ఇచ్చారు.
ఎస్సీ వర్గీకరణ పూర్తి అయ్యే వరకు నోటిఫికేషన్ ఇవ్వవద్దు అని అనాడు చెప్పాము. రేపు సబ్ కమిటీ ఉన్నతాధికారులతో నోటిఫికేషన్ ప్రక్రియపై భేటీ అవుతాయి. త్వరలోనే అన్ని నోటిఫికేషన్లు ఎస్సీ రిజర్వేషన్ల అమలుతో విడుదల అవుతాయి. 59 ఉప కులాలకు ఎస్సీ రిజర్వేషన్లు అమలు చేయడానికి వన్ మ్యాన్ జ్యుడిషియల్ కమిషన్ పని చేసింది. 50వేల వినతులను అక్తర్ కమిషన్ పరిశీలన చేసి ఎస్సీ రిజర్వేషన్లు మూడు కేటగిరీలుగా విభజన చేశారు. గ్రూప్ఏ-1, గ్రూప్‌బీ-9, గ్రూప్‌సీ-5 శాతంతో అసెంబ్లీలో చట్టం చేశాం. గవర్నర్ ఆమోదం తెలిపారు. మొత్తం ఇండియాలో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎస్సీ రిజర్వేషన్లను అమలు చేస్తున్న మొదటి రాష్ట్రం తెలంగాణ. ఇందుకు సంబంధించి జీవో-33 విడుదల చేశాము. యాక్ట్ 15తో మూడు భాషల్లో విడుదల చేశాం. జీవో-9ను విడుదల చేశాం. రాబోయే రోజుల్లో ఎస్సీ రిజర్వేషన్లు ఎంత పెరిగితే ఆ స్థాయిలో రిజర్వేషన్లు అమలు చేస్తామని వ్యాఖ్యలు చేశారు.
Also Read : Car Tragedy: రంగారెడ్డి జిల్లాలో విషాదం ! కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి !