Telangana Government: గచ్చిబౌలిలో 400 ఎకరాల వేలంపాటకు తెలంగాణ సర్కార్‌ నిర్ణయం

గచ్చిబౌలిలో 400 ఎకరాల వేలంపాటకు తెలంగాణ సర్కార్‌ నిర్ణయం

Telangana Government : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గచ్చిబౌలిలోని 400 ఎకరాల వేలంపాటకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ వేలం పాటకు సంబంధించి కన్సల్టెంట్‌ నియామకానికి తాజాగా టెండర్లను ఆహ్వానించింది. ఈ నెల 15 వరకు బిడ్‌ దాఖలుకు గడువు ఇచ్చింది. దీనితో గచ్చిబౌలి భూముల అమ్మకం రాజకీయంగా దుమారం రేపుతోంది.

Telangana Government…

ఇది ఇలా ఉండగా భూముల అమ్మకానికి రేవంత్‌ సర్కార్‌ కుట్రలు చేస్తోందంటూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, హరీష్‌రావు ఆరోపించారు. రూ. 30 వేల కోట్ల విలువైన భూములు కారు చౌకగా కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నాడు పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు భూములు అమ్మొద్దని రేవంత్‌ సుద్దులు చెప్పారు. కాని ఇప్పుడు సీఎం కాగానే భూములు అమ్మకానికి సిద్ధం అవుతున్నారంటూ హరీష్‌రావు దుయ్యబట్టారు. ప్రభుత్వ భూములంటే పెద్దలిచ్చిన ఆస్తి… తెలంగాణ జాతి సంపద… ఆ భూములను అమ్మితే భవిష్యత్తులో స్మశానాలు నిర్మించాలంటే కూడా భూమి లేకుండా పోతుందంటూ పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌ మొసలి కన్నీరు కార్చారని హరీష్‌రావు గుర్తుచేశారు. ప్రభుత్వ భూములను అమ్మబోంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించి మూడు నెలలైనా గడవక ముందే విలువైన ఆస్తులను కొల్లగొట్టేందుకు కుట్ర పన్నారంటూ కాంగ్రెస్‌ సర్కార్‌ని హరీష్‌రావు నిలదీశారు.

Also Read : Meenakshi Natarajan: కాంగ్రెస్ నేతలకు మీనాక్షి నటరాజన్‌ స్ట్రాంగ్ వార్నింగ్‌

Leave A Reply

Your Email Id will not be published!