IAS Transfers : తెలంగాణలో ఐఏఎస్ ల బదిలీ
9 మందిని ట్రాన్స్ ఫర్ చేసిన సీఎం
IAS Transfers : హైదరాబాద్ – రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్(Congress) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎంగా ఎనుముల రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించాక సీన్ మారింది. తన దూకుడు పెంచారు. వచ్చిన వెంటనే ప్రధాన శాఖలపై సమీక్షలు చేపట్టారు. సీనియర్ ఐఏఎస్, పోలీస్ ఆఫీసర్లను మార్చారు. ప్రధానంగా ముగ్గురు సీపీలను మార్చడం సంచలనం కలిగించింది.
IAS Transfers Viral in Telangana
తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కీలక మార్పులు చేశారు. ఇందులో భాగంగా 9 మంది ఐఏఎస్ ఆఫీసర్లను బదిలీ చేశారు. ఈ మేరకు సర్కార్ ఓకే చెప్పింది. ఇందులో భాగంగా బదిలీ అయిన ఐఏఎస్ లలో నిర్మల్ అడిషనల్ కలెక్టర్ గా ఫైజాన్ అహ్మద్ ను నియమించింది.
హన్మకొండలో అడిషనల్ కలెక్టర్ గా రాధా గుప్త, ములుగు అడిషనల్ కలెక్టర్ గా పి. శ్రీజ, రాజన్న సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్ గా పి. గౌతమి, జనగామ అడిషనల్ కలెక్టర్ గా పర్మార్ పింకేష్ కుమార్ లలిత్ కుమార్ , మహబూబాబాద్ అదనపు కలెక్టర్ గా లెనిన్ వత్సల్ టోప్పో ను బదిలీ చేశారు.
మహబూబ్ నగర్ అడిషనల్ కలెక్టర్ గా శివేంద్ర ప్రతాప్ , వనపర్తి అదనపు కలెక్టర్ గా సంచిత్ గంగ్వార్ , జయశంకర్ భూపాలపల్లి అదనపు కలెక్టర్ గా పి. కధీరవన్ ను నియమించారు.
Also Read : Perni Nani : బాబుకు పవన్ ఊడిగం – నాని