Telangana High Court: పిటిషనర్ కు కోటి జరిమానా విధిస్తూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
పిటిషనర్ కు కోటి జరిమానా విధిస్తూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
Telangana High Court : తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. హైకోర్టును తప్పుదోవ పట్టించేందుకు యత్నించిన పిటిసనర్ కు కోటి రూపాయలు జరిమానా విధించింది. హైకోర్టు(Telangana High Court)లో ఒక పిటిషన్ పెండింగ్ లో ఉండగా మరో బెంచ్ కు వెళ్లినందుకు సదరపు పిటిషనర్ భారీ మూల్యం(Fine) చెల్లించుకున్నాడు. హైకోర్టును తప్పుదోవ పట్టించేఆలా పిటిషన్లు వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి జస్టిస్ భీమపాక నగేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టును తప్పుదోవ పట్టించేందుకు యత్నించినందుకు కోటి రూపాయలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. కాగా, ప్రభుత్వ భూముల కబ్జాకు పాల్పడే వారికి ఈ తీర్పు ఓ చెంపపెట్టు లాంటిదని పలువురు చర్చించుకుంటున్నారు. మరోవైపు జస్టిస్ నగేశ్ ఇచ్చిన తీర్పు ఇప్పుడు సంచలనంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
Telangana High Court…
బండ్లగూడ మండలం కందికల్లో సర్వే నెంబర్ 310/1, 310/2లలో 9.11 ఎకరాల భూమి ఉందని, ఈ భూమిని అధికారులు రిజిస్ట్రేషన్ చేయడం లేదని వెంకట్రామిరెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషనర్ తరఫున న్యాయవాది కందగట్ల ధీరజ్ వాదనలు వినిపించారు. భూములు రిజిస్ట్రేషన్ చేయొద్దంటూ బండ్లగూడ తహశీల్దార్ లేఖ రాశారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పిటిషనర్ తన భూమిని సేల్ డీడ్ చేసుకునేలా రిజిస్ట్రేషన్ అధికారులను ఆదేశించాలని కోరారు.
పిటిషనర్ పేర్కొన్న సర్వే నెంబర్లు కందికల్ గ్రామంలో లేవని, ఆ గ్రామంలో 309/5తోనే సర్వేనెంబర్ ముగుస్తుందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. తప్పుడు పత్రాలు సృష్టించి వెంకట్రామిరెడ్డి ప్రభుత్వ భూమిని కాజేయాలని చూస్తున్నారని వివరించారు. ఈ భూమిపై గతంలోనే పిటిషనర్ తండ్రి హైకోర్టులో రెండు పిటిషన్లు వేశారని, వేర్వేరుగా దాఖలు చేసిన రెండు పిటిషన్లను ఆయన విరమించుకున్నారని ప్రభుత్వ న్యాయవాది (జీపీ) ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ పిటిషన్ల గురించి వెంకట్రామిరెడ్డి తన అఫిడవిట్లో ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. కందికల్ లో ఉన్న ప్రభుత్వ భూమిపై ఇప్పటికే యాజమాన్య హక్కులపై కేసులు నడుస్తున్నాయని, పాత పిటిషన్ల గురించి చెప్పకుండా వెంకట్రామిరెడ్డి కోర్టును తప్పుదోవ పట్టించారని జీపీ తెలిపారు. ప్రభుత్వ న్యాయవాది వాదనతో కోర్టు ఏకీభవించింది. కోర్టును తప్పుదోవ పట్టించడంతో పాటు, విలువైన సమయాన్ని వృథా చేసినందుకు రూ.కోటి జరిమానా విధిస్తూ న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక ఆదేశాలు జారీ చేశారు.
Also Read : SC, ST Atrocity Case: బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు