Telangana High Court: సిగాచీ పరిశ్రమ ఘటనపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

సిగాచీ పరిశ్రమ ఘటనపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

Telangana High Court : సిగాచీ పరిశ్రమలో పేలుడు ఘటనపై హైకోర్టులో పిల్‌ దాఖలైంది. కె.బాబురావు అనే వ్యక్తి ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. సిగాచీ యాజమాన్యం సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే పేలుడు జరిగిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ ఘటనలో 54 మంది మృతి చెందగా… 28 మంది గాయపడ్డారని, 8 మంది ఆచూకీ ఇంకా లభించలేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వసుదా నాగరాజు హైకోర్టుకు తెలిపారు.

Telangana High Court Notices to

‘‘ఇప్పటి వరకు మృతుల ఆచూకీ లేని వాళ్ల కుటుంబాలకు, గాయపడిన వారికి ప్రకటించిన పరిహారం చెల్లించలేదు. పరిశ్రమ యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పరిశ్రమలో పేలుడుకు గల కారణాలపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదికను బయటపెట్టాలి. భానూరు పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందంతో దర్యాప్తు చేయించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పరిశ్రమలపై అన్ని భద్రతా చర్యలు ఉండేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలి’’ అని పిటిషనర్‌ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించారు. అనంతరం ఈ పిటిషన్‌పై మూడు వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది.

Also Read : MLA Nayana Motamma: ధర్మం కోసమే కాషాయ శాలువా – కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నయన మోటమ్మ

Leave A Reply

Your Email Id will not be published!