Telangana Secretariat : సచివాలయం ఇంధ్ర భవనం
కోట్లాది రూపాయలతో నిర్మాణం
Telangana Secretariat : భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సచివాలయం ఇంధ్ర భవానినికి ఇవాళ మోక్షం లభించింది. మొదట రూ. 400 కోట్ల అంచనాతో ప్రారంభించిన ఈ సెక్రటేరియేట్(Telangana Secretariat) రాను రాను ఖర్చు తడిసి మోపెడైంది. ఒక రకంగా ప్రజలకు భారం తప్ప ఒనగూరింది ఏమీ లేదంటున్నాయి ప్రతిపక్షాలు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా సచివాలయాన్ని పునర్ నిర్మించారు. ఉన్న సచివాలయాన్ని కూల్చేశారు.
మొత్తం ఆరు అంతస్తులు ఉన్నాయి ఈ భవనంలో. మొత్తంగా ఇది ఆనాటి రాజుల కాలం నాటి భవనాన్ని తలపింప చేస్తోంది. మరి సామాన్యులకు ఇందులో చోటు దక్కుతుందా అన్నది అనుమానం. ఇక ఫ్లోర్ ల వారీగా చూస్తే గ్రౌండ్ ఫ్లోర్ లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ (ఎ-వింగ్ ) లో ఉంటారు. ఇక బి వింగ్ లో మల్లారెడ్డి కార్మిక శాఖ మంత్రికి కేటాయించారు. ఫస్ట్ ఫ్లోర్ లో ఎ – వింగ్ లో రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ కొలువు తీరుతారు. ఇక బి – వింగ్ లో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, డి – వింగ్ లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు కేటాయించారు.
ఇక రెండో అంతస్తులో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కు కేటాయించారు. ఇది ఎ – వింగ్ లో ఉంది. ఇక బి – వింగ్ లో ఇదే ఫ్లోర్ లో విద్యుత్ శాఖ మంత్రి గుండ్ల కట్ల జగదీశ్వర్ రెడ్డికి కేటాయించారు. డి – వింగ్ లో పశు సంవర్దక, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొలువు తీరనున్నారు. మూడో ఫ్లోర్ లో ఎ – వింగ్ లో ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ , బి – వింగ్ లో గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ , డి – వింగ్ లో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి కేటాయించారు.
నాలుగో అంతస్తులో ఎ – వింగ్ లో న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి , బి – వింగ్ లో ఎక్సైజ్ శాఖ మంత్రి విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్ , గనుల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కు డి -వింగ్ లో చోటు కల్పించారు. 5వ అంతస్తులో రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డికి ఎ – వింగ్ లో , రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు డి – వింగ్ లో కేటాయించారు. 6వ అంతస్తులో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, సిఇఓ కార్యాలయానికి ఏర్పాట్లు చేశారు.
Also Read : ఎన్నికలకు సిద్దం బాబుతో స్నేహం
The Beginning of a New Era 💥
Dr. B.R. Ambedkar Telangana State Secretariat
New Secretariat was constructed in tune with the aspirations of people, to boost their self-esteem and enhance Telangana’s prestige#DrBRAmbedkar #TelanganaSecretariat #CMKCR pic.twitter.com/WHGEsISh00
— BRS News (@BRSParty_News) April 30, 2023