Telangana Secretariat : తెలంగాణ సచివాలయం అద్భుతం
విస్తు పోయిన విశ్రాంత ఐఏఎస్ ఆఫీసర్స్
Telangana Secretariat : హైదరాబాద్ – తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సచివాలయాన్ని చూసి విస్మయానికి గురయ్యారు విశ్రాంత ఐఏఎస్ ఆఫీసర్స్. ఆహ్లాదకర వాతావరణంలో అన్ని సౌకర్యాలతో అద్భుతంగా ఉందని కితాబు ఇచ్చారు. ఇందులో పని చేస్తున్న ఆఫీసర్లు ధన్యులంటూ కితాబు ఇచ్చారు.
దేశానికే రాష్ట్ర సచివాలయం ఆదర్శ ప్రాయంగా నిలుస్తుందనడంలో సందేహం లేదని పేర్కొన్నారు. అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్(KCR) అభినందనీయుడని ప్రశంసించారు విశ్రాంత సీనియర్ ఐఏఎస్ లు.
Telangana Secretariat Got Appreciations
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ సెక్రటేరియట్ ను రిటైర్డ్ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ సందర్శించారు. వారికి రాష్ట్ర సర్కార్ అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను సహా సచివాలయ వివరాలు అందజేశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి.
ఇందులో భాగంగా సీనియర్ ఆఫీసర్స్ సచివాలయం మొత్తం కలియ తిరిగారు. అంతస్తుల వారీగా తిరిగి చూశారు. సీఎం చాంబర్ అద్భుతంగా ఉందంటూ ప్రశంసించారు. మొదట దీని నిర్మాణానికి రూ. 600 కోట్లు ఖర్చవుతుందని అనుకున్నారు. కానీ తీరా మొత్తం పూర్తయ్యాక ఏకంగా రూ. 1200 కోట్లు ఖర్చయినట్లు ప్రభుత్వమే స్పష్టం చేసింది.
Also Read : HCA Election : హెచ్‌సీఏ ఎన్నికల నగారా