Telangana TET Results: తెలంగాణ టెట్‌ ఫలితాలు విడుదల !

తెలంగాణ టెట్‌ ఫలితాలు విడుదల !

Telangana TET Results: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను సీఎం రేవంత్‌ రెడ్డి విడుదల చేశారు. టెట్‌ పేపర్‌-1లో 67.13 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 85,996 మంది అభ్యర్థుల్లో 57,725 మంది క్వాలిఫై అయ్యారు. టెట్‌ పేపర్‌-2లో 34.18 శాతం ఉత్తీర్ణులయ్యారు. 1,50,491 మందిలో అర్హత సాధించగా… 51,443 మంది ఉత్తీర్ణత సాధించారు. 2023తో పోలిస్తే పేపర్‌-1లో 30.24 శాతం, పేపర్‌-2లో 18.88 అర్హత శాతం పెరిగింది.

Telangana TET Results..

మరోవైపు టెట్‌ దరఖాస్తుదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఉపశమనం కలిగించింది. అర్హత సాధించని వారు వచ్చే టెట్‌ కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. అర్హత సాధించిన వారు డీఎస్సీకి ఉచితంగా దరఖాస్తు చేసుకునే వీలు కల్పించింది. ఎన్నికల కోడ్‌ వల్ల టెట్‌-2024 దరఖాస్తు ఫీజును ప్రభుత్వం తగ్గించలేకపోయింది. ఈ నేపథ్యంలో తదుపరి టెట్‌, డీఎస్సీ దరఖాస్తుదారులకు ఉపశమనం కల్పించాలని నిర్ణయించింది.

Also Read : Mohan Charan Majhi: ఒడిశా నూతన సీఎంగా మోహన్‌ చరణ్ మాఝి ప్రమాణ స్వీకారం !

Leave A Reply

Your Email Id will not be published!