Telangana Verdict Comment : గులాబీ వికసించేనా చేతికి చిక్కేనా
తెలంగాణ ప్రజా తీర్పుపై ఉత్కంఠ
Telangana Verdict : పోరు ముగిసింది. ఎవరు విజేతలో తేలే సమయం ఆసన్నమైంది. యావత్ తెలంగాణ(Telangana) సమాజం ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తోంది. ఎవరికి వారే తాము గెలుస్తామని ముందస్తుగానే ప్రకటిస్తున్నారు. అంతకు మించి ఎక్కువగా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక సర్వేలన్నీ గంప గుత్తగా అత్యధిక శాతం కాంగ్రెస్(Congress) పార్టీ వైపు మొగ్గు చూపుతున్నా చివరి నిమిషం వరకు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మొత్తం 119 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. ఆదివారం ప్రజా తీర్పు వెలువడనుంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల తో పాటు సాధారణ ప్రజలు వేసిన ఓట్లను లెక్కించనున్నారు. ఉదయం 11 గంటల లోపు తొలి విడత రౌండ్ ఫలితాలు రానున్నాయి. రాష్ట్రంలో ఏ పార్టీకి ట్రెండ్ వస్తుందనేది తేట తెల్లం కానుంది. ఇక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మొత్తంగా ప్రస్తుత పాలిటిక్స్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ పవర్ లోకి రానుందని అన్ని వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా రేవంత్ కు జెడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించడంతో ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసినట్లయింది.
Telangana Verdict Comment Viral
ఇక బరిలోకి దిగకుండా కొత్తగా పార్టీ స్థాపించి బీఆర్ఎస్ సర్కార్ ను బందిపోట్ల రాష్ట్ర సమితిగా అభివర్ణించడమే కాకుండా ఏ పార్టీ చేయలేని రీతిలో ఫైట్ కొనసాగిస్తూ వచ్చింది వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల. ఆమె ఇవాళ సీఎం కేసీఆర్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. బై బై కేసీఆర్ అంటూ ఉన్న సూట్ కేస్ ను కేసీఆర్ ఉంటున్న ప్రగతి భవన్ కు పంపించింది. ప్రస్తుతం ఆమె వైరల్ గా మారారు. మొత్తంగా తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారి పోయింది. ఏ పార్టీ అయినా సరే , ఆధిక్యంలో ఉన్నా సరే తానే సీఎం అవుతానంటూ ఇప్పటికే ప్రకటించారు సీఎం కేసీఆర్. దీంతో అన్ని పార్టీలలో ఆందోళన మొదలైంది. ఎందుకంటే ఆయన చేసిన కామెంట్ దేశ వ్యాప్తంగా కలకలం రేపాయి.
ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ స్థాపనంతో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో తాను ఫండింగ్ చేసేందుకు రెడీగా ఉన్నానంటూ స్పష్టం చేశాడు. దీంతో గతంలో కాంగ్రెస్, టీడీపీ నుంచి ఎన్నికైన ప్రజా ప్రతినిధులను తమ పార్టీలోకి చేర్చుకున్నారు. దాని వెనుక కోట్లాది రూపాయల డీల్ జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. ఇది పక్కన పెడితే ఈసారి ఎన్నికల్లో గెలుపొందిన వారు జంప్ జిలానీలుగా మారితే తప్పకుండా ఆందోళనకు దిగుతామని ప్రకటించింది పౌర సమాజం. ఇదే సమయంలో సోషల్ డెమోక్రటిక్ ఫోరం కన్వీనర్ , మాజీ ఏఐఎస్ అధికారి ఆకునూరి మురళి ఏకంగా సంచలన ప్రకటన చేశారు. ఎవరైనా సరే చేరుతున్నారని తెలిస్తే రాళ్లతో కొట్టి తరమాలని పిలుపునిచ్చారు. ఆయన చేసిన ఈ కామెంట్ ప్రస్తుత అభ్యర్థుల్లో గుబులు రేపుతోంది.
ఇవాళ పౌర సమాజం మొత్తం ప్రభుత్వంపై వ్యతిరేకతను కనబరుస్తోంది. ఇదే ఆగ్రహం ఓట్ల రూపంలోకి మారిందని ఓటింగ్ సరళితో పాటు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఇక ఏ మాత్రం బీఆర్ఎస్(BRS) పార్టీకి 40 సీట్లు వచ్చినా ఏదో రకంగా ఇటు బీజేపీ(BJP), అటు ఎంఐఎంతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్లాన్ లో కేసీఆర్ ఉన్నారని టాక్. అందుకే కాంగ్రెస్ పార్టీ ముందు జాగ్రత్త పడుతోంది. వారిని కట్టడి చేసేందుకు ఏఐసీసీ రంగంలోకి దిగింది. ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు ఎవరూ పక్క చూపు చూడకుండా నియమించింది. మొత్తంగా చూస్తే గులాబీ గుభాళిస్తుందా లేక చేతికి తెలంగాణ చిక్కుందా లేక కమలం వికసిస్తుందా అన్నది తేత తెల్లం అవుతుంది. తెలంగాణ సమాజం ఏ మేరకు తీర్పు చెబుతుందనేది బ్యాలెట్లలో భద్రమై ఉంది. ప్రజా తీర్పు అనేది సుస్పష్టంగా ఉందా లేక హంగ్ దిశగా సాగుతుందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
Also Read : DK Shiva Kumar : కేసీఆర్ పై డీకే షాకింగ్ కామెంట్స్