Telugu Student Shot Dead : ఆంధ్రా విద్యార్థి కాల్చివేత‌

వెల్ల‌డించిన యుఎస్ పోలీసులు

Telugu Student Shot Dead : గ్రాడ్యుయేష‌న్ కు 10 రోజుల ముందు యుఎస్ గ్యాస్ స్టేష‌న్ లో ఆంధ్రా విద్యార్థి(Telugu Student Shot Dead) కాల్చి చంప‌బ‌డ్డాడు. ఏప్రిల్ 20న కోలంబస్ పోలీసు అధికారులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్నారు. కాల్పుల‌కు గురైన వ్య‌క్తి ఏపీకి చెందిన సాయిష్ వీరాగా గుర్తించారు. త‌న మాస్ట‌ర్స్ డిగ్రీని 10 రోజుల్లో పూర్తి చేయ‌బోతున్నాడు. హెచ్ -1 బి వీసా కూడా పొందాడు.

ఈ సంఘ‌ట‌న గురువారం రాష్ట్రంలోని కొలంబ‌స్ డివిజ‌న్ లో జ‌రిగింద‌ని తెలిపారు. వీర ఏపీ రాష్ట్రానికి చెందిన వ్య‌క్తి. విద్యార్థిని సాయిష్ వీరగా గుర్తించామని, ఈ సంఘటన గురువారం రాష్ట్రంలోని కొలంబస్ డివిజన్‌లో జరిగిందని వారు తెలిపారు. మీడియా కథనాల ప్రకారం వీర ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వ్యక్తి. కొలంబ‌స్ అగ్ని మాప‌క సిబ్బంది వ‌చ్చి బాధితుడిని స్థానిక ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్రాణాల‌ను ర‌క్షించే ప్ర‌య‌త్నం చేసినా ఫ‌లితం లేక పోయింది. బాధితుడు తెల్ల‌వారుజామున 1.27 గంట‌ల‌కు మ‌ర‌ణించిన‌ట్లు పేర్కొన్నారు.

ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు కొన‌సాగుతోంద‌ని, కుటుంబ స‌భ్యుల‌కు స‌మాచారం అందించామ‌ని చెప్పారు. కొలంబ‌స్ డివిజ‌న్ పోలీసులు సీసీ టీవీ కెమెరాల్లో క‌నిపించిన నిందితుడి ఫోటోను కూడా షేర్ చేశారు. ఎన్నో ఆశ‌యాల‌తో త‌న కుటుంబంలో మొద‌టి వాడైన వీర అమెరికాకు వ‌చ్చి రెండేళ్ల కింద‌ట త‌న తండ్రి చ‌ని పోవడంతో కుటుంబాన్ని ఉద్ద‌రించాల‌ని అనుకున్నాడు. అంత‌లోనే కాల్పుల‌కు గుర‌య్యాడు. కొలంబ‌స్ ప్రాంతంలో సాయిస్ వీర ప్ర‌తి ఒక్క‌రికీ తెలుస‌ని స‌మాచారం.

Also Read : ఉగ్ర మూకల ఘాతుకం దారుణం

Leave A Reply

Your Email Id will not be published!