AP DSC 2024: డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన మంత్రి బొత్స !
డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన మంత్రి బొత్స !
AP DSC 2024: ఉపాధ్యాయ ఆశావాహులు ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తోన్న డిఎస్సీ(AP DSC) నోటిఫికేషన్ ను ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 6,100 ఉపాధ్యాయ పోస్టులకు గాను డిఎస్సీ-2024ను ఏపీ విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం రాష్ట్ర సచివాలయంలో విడుదల చేసారు. వీటిలో 2,280 ఎస్జీటీ పోస్టులు ఉండగా… స్కూల్ అసిస్టెంట్ 2,299, టీజీటీ 1,264, పీజీటీ 215, ప్రిన్సిపల్ 42 ఖాళీలు ఉన్నాయి. ఏపీ డీఎస్సీకు సంబంధించి అభ్యర్ధుల నుండి ఫిబ్రవరి 12 నుంచి 22 వరకు https://cse.ap.gov.in/loginhome వెబసైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు మంత్రి బొత్స తెలిపారు. డిఎస్సీ-2024కు సంబంధించి మాక్ టెస్ట్‌ను ఫిబ్రవరి 24 నుంచి అదే వెబ్ సైట్ లో అన్ లైన్ లో రాయొచ్చని తెలిపారు.
మార్చి 5 నుంచి ఆన్ లైన్ లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని… మార్చి 15 నుంచి 30 వరకు రోజూ రెండు సెషన్లలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటి) ద్వారా పరీక్ష నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సెషన్ 1 ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, సెషన్ 2 పరీక్ష మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఉంటుంది. డీఎస్సీ ప్రాథమిక కీని మార్చి 31న విడుదల చేసి ఏప్రిల్ 1వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఏప్రిల్ 2న తుది కీ విడుదల చేసి ఫలితాలను ఏప్రిల్ 7న ప్రకటిస్తారని ఆయన స్పష్టం చేసారు. ఇక ఏపీ డిఎస్సీ-2024కు సంబంధించిన పూర్తివివరాలకు ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించాలని ఆయన తెలిపారు.
AP DSC 2024 – డిఎస్సీ కంటే ముందు టెట్ నిర్వహణ
AP DSC 2024 పరీక్షతో పాటు AP TET 2024 పరీక్షను కూడా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏపీ టెట్ పరీక్షకు ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆన్‌లైన్ మాక్ టెస్ట్ 19న అందుబాటులోకి వస్తుంది. టెట్ హాల్ టికెట్లు ఫిబ్రవరి 23నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షను ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ప్రాథమిక కీని మార్చి 10న విడుదల చేస్తారు. ఈ కీపై మార్చి 11వరకు అభ్యంతరాలు స్వీకరించి 13న తుదికీ విడుదల చేస్తారు. మార్చి 14న టెట్ ఫలితాలు ప్రకటిస్తామని స్కూల్ ఎడ్యుకేషన్ కమీషనర్ సురేష్ కుమార్ తెలిపారు.
Also Read : Indian Students Death in US : అమెరికాలో మరో భారత విద్యార్థి మృతి..అసలు ఎమ్ జరుగుతుంది..