Temjen Imna Along : జెండాకు జై కొట్టిన ఇమ్నా
నాగాలాండ్ మంత్రి వైరల్
Temjen Imna Along : టెమ్ జెన్ ఇమ్నా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆయన రెండోసారి నాగాలాండ్ రాష్ట్రంలో మంత్రిగా కొలువు తీరారు. ఇవాళ 77వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా హంగు ఆర్భాటం లేకుండా త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేశారు. ఈ సందర్బంగా ట్విట్టర్ లో తన ఫోటోను పంచుకున్నారు. జాతిని మేల్కొల్పే గొప్ప పతాకం త్రివర్ణ పతాకమని కొనియాడారు టెమ్ జెన్ ఇమ్నా.
Temjen Imna Along Celebrating Independence Day
ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దేశం యువతపై ఆధారపడి ఉందన్నారు. భవిష్యత్తు మొత్తం బాగుండాలంటే మనందరం దేశం కోసం కష్టపడాలని పిలుపునిచ్చారు నాగాలాండ్ మంత్రి. ఇదే సమయంలో ఒకప్పుడు పంతులుగా ఉన్న టెమ్ జెన్ ఇమ్నా(Temjen Imna Along) ఉన్నట్టుండి సదరు రాష్ట్రంలో మోస్ట్ పాపులర్ హీరోగా మారి పోయారు. అంతే కాదు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో అత్యంత జనాదరణ పొందిన నాయకులలో ఒకడిగా ఉన్నాడు. మోదీ తర్వాత , కిరణ్ రిజిజు, కె. అన్నామలై తో పాటు టెమ్ జెన్ ఇమ్నా కూడా ఒకరు.
పాఠాలు చెబుతూ వచ్చిన ఇమ్నా ఉన్నట్టుండి సామాజిక సేవ వైపు మళ్లాడు. ఆ వెంటనే బీజేపీలో చేరాడు. రాష్ట్ర చీఫ్ గా ఎంపికయ్యాడు. పార్టీని బలోపేతం చేశాడు. చివరకు అధికారంలో భాగం పంచుకునేలా చేసిన ఘనత ఇమ్నాదే. మొత్తంగా ఇమ్నానా మజాకా అంటున్నారు ఆయన ఫ్యాన్స్.
Also Read : Rahul Gandhi Met : రాహుల్ మెచ్చుకున్న రామేశ్వర్