Terrorist Killed : చొరబాటుకు యత్నం ఉగ్రవాది హతం
జమ్మూ కాశ్మీర్ లో చోటు చేసుకున్న ఘటన
Terrorist Killed : జమ్మూ కాశ్మీర్ లోని పూంచ్ సెక్టార్ లో అతి పెద్ద చొరబాటు ప్రయత్నాన్ని భారత ఆర్మీ విఫలం చేసింది. ఈ ఘటనలో చొరబాటుకు ప్రయత్నం చేసిన ఉగ్రవాది హతమయ్యాడు. జమ్మూకు చెందిన రక్షణ ప్రతినిధి మాట్లాడారు. ఈ ప్రాంతంలో కార్బన్ ఏర్పాటు చేశామని తెలిపారు.
సెర్చ్ ఆపరేషన్ పురోగతిలో ఉందని పేర్కొన్నారు. పూంచ్ సెక్టార్ లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంట శనివారం అర్ధరాత్రి చొరబాటుకు యత్నిస్తున్న ఉగ్రవాదిని గుర్తించి కాల్చి పారేసినట్టు(Terrorist Killed) స్పష్టం చేశారు.
నియంత్రణ రేఖ వెంట గస్తీ తిరగడం మామూలేనని పేర్కొన్నారు. కొందరి గుర్తు తెలియిని గుంపు నకు సంబంధించిన అనుమానాస్పద కదలికలు కనిపించడంతో దళాలు అప్రమత్తం అయ్యాయని చెప్పారు. కంచెకు దగ్గరగా కొందరు ఉగ్రవాదులు దాటేందుకు యత్నించారని తెలిపారు. దీంతో వెంటనే అప్రమత్తమైన దళాలు కాల్పులకు పాల్పడ్డాయి.
ఈ ఘటనలో ఓ ఉగ్రవాదిని హతం చేసినట్లు తెలిపారు జమ్మూకి చెందిన రక్షణ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ . ఇంకా కార్బన్ కొనసాగుతోందన్నారు. ఎక్కడా తగ్గే ప్రసక్తి లేదని , ఎక్కడ దాక్కున్నా వదిలి పెట్టబోమంటూ హెచ్చరించారు. ఇప్పటికే దళాల సెర్చింగ్ తో ఉగ్రవాదులకు అడ్డా లేకుండా పోయిందన్నారు.
Also Read : టైగర్ రిజర్వ్ లో మోదీ సఫారీ