Dubai Library : అతి పెద్ద గ్రంథాలయం దుబాయ్ ఆదర్శం
పుస్తకాలు చదవడం దేశానికి అవసరం
Dubai Library : పుస్తకాలు లేకుండా నేను ఉండలేను అంటాడు ప్రముఖ రష్యన్ రచయిత మాగ్జిం గోర్కీ. పుస్తకాలు లేని ఇల్లు శ్మశానంతో సమానం అన్నాడు.
చిరిగిన బట్టలు తొడుక్కో. కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో అంటాడు మహా రచయిత. నన్ను నేను తెలుసు కోవడానికి, మంచి మార్గం ఏమిటో నడిచేందుకు పుస్తకాలు దారి చూపిస్తాయంటాడు పుష్కిన్.
మనకు అరబ్ , ముస్లిం దేశాలంటే ఓ విధమైన దురభిప్రాయం ఉంటుంది. కానీ అక్కడి వారు పుస్తకాలను మరిచి పోవడం లేదు. వాటిని శ్వాసిస్తున్నారు.
దేశం పురోభివృద్ధి సాధించాలన్నా లేదా సమర్థవంతమైన పాలన సాగించాలన్నా, ప్రజలు సమాచారం తెలుసు కోవాలంటే పుస్తకాలు ఉండాల్సిందేనని స్పష్టం చేస్తోంది దుబాయ్.
ప్రపంచంలోనే అత్యధిక పుస్తకాలు కలిగిన, అతి పెద్ద లైబ్రరీ(Dubai Library) (గ్రంథాలయం)ను ప్రారంభించారు మహమ్మద్ బిన్ రషీద్. ఇందులో మిలియన్ కంటే ప్రచురించిన పుస్తకాలు, డిజిటల్ పుస్తకాలు ఉన్నాయి.
ఇది ఓ రికార్డు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రెసిడెంట్ , ప్రధాన మంత్రి , దుబాయ్ పాలకుడు అయిన హిస్ హైనస్ షేక్ మొహమ్మద్ బిన్
రషీద్ అల్ ముక్తూమ్ కు పుస్తకాలంటే చచ్చేంత ఇష్టం.
సాంస్కృతిక వారసత్వం బలంగా ఉండాలంటే పుస్తకాలతో కూడిన లైబ్రరీ(Dubai Library) ఉండాలని అంటారు. ఆయన చొరవతో ఇది అద్భుతంగా రూపుదిద్దుకుంది.
అత్యాధునిక సౌకర్యాలతో దీనిని నిర్మించారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఓ ఇంద్ర భవనం అని చెప్పక తప్పదు. బిలియన్ల పెట్టుబడితో దీనిని ఏర్పాటు చేశారు.
ఈ లైబ్రరీ వ్యక్తిగత, సామాజిక స్థాయిలలో సృజనాత్మకత, జ్ఞానం, కళల అభివృద్ధికి తోడ్పడేలా దీనిని తీర్చిదిద్దారు. ప్రతి ఒక్కరిలో
పఠనం (అధ్యయనం) పెంపొందించేలా చేశారు.
కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా ఎవరైనా ఇక్కడ చదువుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మేధావులు, సాహిత్య, ఊహాత్మక వ్యక్తులకు ఇది ఓ అక్షయపాత్ర అని చెప్పడంలో తప్పు లేదు.
ఈ సందర్భంగా యూఏఈ అధ్యక్షుడు, ప్రధాన మంత్రి మొహ్మద్ రషీద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేము మా కొత్త, రాబోయే తరాల కోసం
సాంస్కృతిక, మేధో భవనాన్ని ప్రారంభించాం.
దీని ద్వారా పఠనాన్ని ప్రోత్సహించాం. జ్ఞానాన్ని వ్యాప్తి చేయడం, పరిశోధకులు, శాస్త్రవేత్తలకు మద్దతు ఇవ్వడం మా ఉద్దేశం. మా లక్ష్యం మానవ మనస్సును ప్రకాశ వంతం చేయడం అని స్పష్టం చేశారు.
ఆర్థిక వ్యవస్థకు జ్ఞానం అవసరం. రాజకీయాలకు కూడా. దేశాలు నేర్చుకోవాలి. ఇవన్నీ పుస్తకాలలో దొరుకుతాయన్నారు.
Also Read : బీసీసీఐని బలోపేతం చేసిన దాల్మియా