Rohit Sharma : బౌల‌ర్ల నిర్వాకం వ‌ల్ల‌నే ప‌రాజ‌యం

ఓట‌మిపై కెప్టెన్ రోహిత్ శ‌ర్మ కామెంట్

Rohit Sharma : భార‌త జ‌ట్టు భారీ టార్గెట్ ను అవ‌లీల‌గా ఛేదించింది ప‌ర్యాట‌క ఆస్ట్రేలియా జ‌ట్టు. మూడు టి20 మ్యాచ్ ల సీరీస్ లో భాగంగా మొహాలీలో జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో స‌త్తా చాటింది.

ఆపై ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భార‌త జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 208 ప‌రుగుల భారీ టార్గెట్ ముందుంచింది.

ఎవ‌రైనా ఇంత‌టి ల‌క్ష్యాన్ని ఛేదించ‌డం ఏ జ‌ట్టుకైనా సాధ్యం కాద‌ని న‌మ్ముతారు. కానీ సీన్ మారింది. భార‌త బౌల‌ర్ల ఆట తీరు ఏ మాత్రం మార లేదు.

ఒక‌రి వెంట మ‌రొక‌రు పోటా పోటీగా ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నారు. ఆస్ట్రేలియా ఆట‌గాళ్లు క్యామ‌రెన్, వేడ్ దంచి కొట్టారు. భువ‌నేశ్వ‌ర్ కుమార్ 4 ఓవ‌ర్లు వేసి 52 ర‌న్స్ ఇచ్చాడు.

ఇక హ‌ర్ష‌ల్ ప‌టేల్ 4 ఓవ‌ర్ల‌లో 49 ర‌న్స్ ఇస్తే యుజ్వేంద్ర చాహ‌ల్ 3.2 ఓవ‌ర్ల‌లో 42 ర‌న్స్ స‌మ‌ర్పించుకున్నాడు. ఇక అక్ష‌ర్ ప‌టేల్ ఒక్క‌డే కొంత మేల‌నిపించాడు.

కేవ‌లం 17 ర‌న్స్ ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు దుమ్ము రేపింది. కోలుకోలేని షాక్ ఇచ్చింది. భార‌త జ‌ట్టు యూఏఈ వేదిక‌గా జ‌రిగిన ఆసియా క‌ప్ లో సైతం ఆశించిన రీతిలో రాణించ‌కుండానే ఇంటి బాట ప‌ట్టింది.

ఇదిలా ఉండ‌గా మ్యాచ్ పూర్త‌యిన త‌ర్వాత భార‌త జ‌ట‌టు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ(Rohit Sharma) మాట్లాడాడు. బౌల‌ర్ల వైఫ‌ల్యం కార‌ణంగానే తాము ఓడి పోయామంటూ పేర్కొన్నాడు. మిగ‌తా రెండు మ్యాచ్ లలో సత్తా చాటుతామ‌ని చెప్పాడు.

Also Read : ఆసిస్ చేతిలో భార‌త్ మ‌టాష్

Leave A Reply

Your Email Id will not be published!