Ajay Rastogi : న్యాయ వ్యవస్థ సీజేఐ చేతిలో పదిలం
న్యాయమూర్తి అజయ్ రస్తోగి కామెంట్స్
Ajay Rastogi : ప్రస్తుతం దేశంలో న్యాయ వ్యవస్థ సీజేఐ ధనంజయ వై చంద్రచూడ్ ఆధ్వర్యంలో బలంగా, పటిష్టంగా, పదిలంగా ఉందన్నారు ప్రధాన న్యాయమూర్తి అజయ్ రస్తోగి. ఆయన జూన్ 17న పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కేంద్రం నుంచి కానీ లేదా ఇతరుల నుంచి ఎక్కడా ఒత్తిళ్లను వృత్తి పరంగా ఎదుర్కోలేదన్నారు. కొందరు కొలీజియం వ్యవస్థపై ప్రశ్నలు సంధిస్తున్నారని అలాంటి వారికి తాను ఒక్కటే చెప్పదల్చుకున్నానని ఈ పద్దతి సమర్థనీయమైనదేనని పేర్కొన్నారు.
సీజేఐ ధనంజయ వై చంద్రచూడ్ అత్యంత అనుభవం కలిగిన న్యాయమూర్తి అని ప్రశంసించారు. ఆయన ఇచ్చే తీర్పులు, చేసే వ్యాఖ్యలు ఎందరినో ఆలోచింప చేస్తాయని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికీ బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న సమయంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయని కానీ వాటిని తట్టుకుని తీర్పులు చెప్పడం మామూలు విషయం కాదన్నారు న్యాయమూర్తి అజయ్ రస్తోగి(Ajay Rastogi).
గతంలో మాజీ న్యాయ శాఖ మంత్రి గా ఉన్న కిరణ్ రిజిజు, ప్రస్తుతం ఉప రాష్ట్రపతిగా ఉన్న జగదీప్ ధన్ ఖర్ కొలీజియం వ్యవస్థకు వ్యతిరేకంగా మాట్లాడారు. దీనిపై ఆయన చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆధునిక టెక్నాలజీని ఇప్పుడు వాడుతున్నాం. సీజేఐ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. కోర్టు ప్రజలకు దగ్గరవుతోందని, ఇందుకు చంద్రచూడ్ ను అభినందించక తప్పదన్నారు . న్యాయ వ్యవస్థ సురక్షితమైన చేతుల్లో ఉందన్నారు.
Also Read : Arvind Kejriwal : సత్తా చాటిన విద్యార్థులకు సీఎం కంగ్రాట్స్
