Farooq Abdullah : న్యాయం జరిగే వరకు హత్యలు ఆగవు
ఫరూక్ అబ్దుల్లా సంచలన కామెంట్స్
Farooq Abdullah : జమ్మూ కాశ్మీర్ లో ఎక్కడో ఒక చోట కాల్పులు కొనసాగుతున్నాయి. ఉగ్రవాదులు మరింత రెచ్చి పోతున్నారు. కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ ప్రభుత్వం ఇక్కడి ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోలేదు. 370 ఆర్టికల్ ను రద్దు చేశారు. మరి దాడులు ఆగాయా మరింతగా పెరిగాయి.
ఇలా చంపుకుంటూ పోతే ఇక జమ్మూ కాశ్మీర్ లో లోయ మాత్రమే ఉంటుందని ఇంకేమీ ఉండదని సంచలన వ్యాఖ్యలు చేశారు నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా(Farooq Abdullah). లక్ష్యంగా చేసుకుని ఒక వర్గాన్ని చంపుకుంటూ పోవడాన్ని ఆయన తప్పు పట్టారు. ప్రధానంగా కాశ్మీరీ పండిట్లపై వరుస దాడులు చోటు చేసుకోవడంపై స్పందించారు.
సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం మానవీయంగా ఆలోచించడం లేదని తనకు అనిపిస్తోందన్నారు. అసలు ఎంత కాలం ఇలా దాడులకు గురి కావాలని ప్రశ్నించారు. దీనికి శాశ్వతమైన పరిష్కారం అన్నది లేదా అని ప్రశ్నించారు ఫరూక్ అబ్దుల్లా. ఇలాంటి హత్యలకు ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు.
కాగా వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణపై జమ్మూ లోని అబ్దుల్లా నివాసంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఇప్పటి వరకు ఇద్దరు కాశ్మీరీ పండిట్లను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. మరో వైపు కేంద్రం మాత్రం సీరియస్ గా తీసుకుంది ఈ దాడులను.
ఎలాగైనా సరే జమ్మూ కాశ్మీర్ లో ఉన్న ఉగ్రవాదులు ఎక్కడున్నా సరే ఏరి పారేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఓ వైపు భారత బలగాలు జల్లెడ పడుతుంటే మరో వైపు ఉగ్రవాదులు రెచ్చి పోతున్నారు. దాడులకు తెగ బడుతున్నారు.
Also Read : అధ్యక్ష ఎన్నికల్లో ఓటేసిన సోనియా