Bhagwant Mann : ఐ యామ్ కామన్ మ్యాన్. నన్ను తాగుబోతు అన్నారు. మద్యం సేవించి చట్ట సభల్లోకి వస్తానని ప్రచారం చేశారు. అన్నిటి కంటే తనను పూర్తిగా నమ్మ లేని వ్యక్తిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.
నేను ఇప్పుడు వ్యక్తిగతంగా ఎవరినీ నిందించ దల్చుకోలేదు. కానీ మనిషి అన్నాక తప్పులు చేస్తారు.
కానీ వాటిని సరిదిద్దుకుని ముందుకు సాగుతారు. నేను కూడా ప్రజా ప్రతినిధిగా నా బాధ్యతలు ఏమిటో తెలుసు.
ఇన్నేళ్లుగా నేను ప్రజా జీవితంలో ఉన్నా. దయచేసి నన్ను నమ్మండి. గతంలో పాలకులంతా భవంతులకే పరిమితం అయ్యారు.
కానీ నేను మీలాంటి సామాన్యుడిని. పంజాబ్ ను కాపాడుకుందాం.
మాఫియాల నుంచి, డాన్ ల నుంచి విష సంస్కృతి నుంచి, లాండ్ , సాండ్ మాఫియాల నుంచి అని ప్రకటించాడు ఆప్ ఎంపీ,
పంజాబ్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్(Bhagwant Mann ). దేశం యావత్ పంజాబ్ వైపు చూస్తోంది.
117 సీట్లలో అధికారానికి కావాల్సిన 59 సీట్ల కంటే మెజారిటీని ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీకి కట్టబెట్టారు.
ముందస్తుగానే ఆప్ చీఫ్ కేజ్రీవాల్ భగవంత్ మాన్ ను ప్రజల తీర్పు మేరకు,
వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని భగవంత్ మాన్ ను సీఎం అభ్యర్థిగా డిక్లేర్ చేశారు.
ముందు నుంచీ చాలా పకడ్బందీగా, వ్యూహాత్మకంగా పంజాబ్ ఎన్నికల విషయంలో వ్యవహరించారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.
ఈ సక్సెస్ క్రెడిట్ అంతా ఆయనదే. కానీ మాన్ కూడా మామూలోడు కాదు. దమ్మున్నోడు. ప్రస్తుతం మాన్ (Bhagwant Mann )సీఎం అయినా నడిపించేది మాత్రం కేజ్రీవాలేనని చెప్పక తప్పదు. ప్రజలు ఎవరైనా తనను కలవవచ్చని ఇప్పటికే ప్రకటించాడు మాన్.
మరి ఏమేరకు వ్యవహరిస్తారనేది వేచి చూడాలి. ఏది ఏమైనా భగవంత్ మాన్ కు కలిసొచ్చింది.
ఆయన ఇంటి ముందు సంబురాలు మిన్నంటాయి. కానీ సాధారణంగానే స్పందించారు.
ప్రజలు ఏది కోరుకుంటే తాము అదవుతామంటూ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా రాజకీయాలలో వ్యక్తిగత ద్వేషాలకు
తావు లేదని నిరూపించారు పీసీసీ చీఫ్ సిద్దూ. ఆయన వెంటనే ఆప్ కు, భగవంత్ మాన్ కు గ్రీటింగ్స్ తెలిపారు.
Also Read : యోగీకే పట్టం అఖిలేష్ కు మంగళం