German Spy Chief : రష్యా ఉక్రెయిన్ పై దాడికి పాల్పడిన సమయంలో జర్మనీ దేశానికి చెందిన స్పై చీఫ్(German Spy Chief )అక్కడే ఉన్నారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. భీకర దాడి నుంచి సురక్షితంగా బయట పడ్డాడు.
ఈ విషయాన్ని అధికారికంగా ఆ దేశం వెల్లడించింది. ఫెడరల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ చీఫ్ ఉక్రెయిన్ లో అత్యవసర చర్చల కోసం అక్కడే ఉన్నట్లు ధ్రువీకరించడం కూడా జరిగింది.
దీంతో ఓ వైపు రష్యా ఇంకో వైపు ఉక్రెయిన్ తో పాటు ఇతర దేశాలు ఉన్నాయన్నమాట. ఇప్పటికే అమెరికా, బ్రిటన్ , యూరోపియన్ కంట్రీస్ అన్నీ ఆర్థిక ఆంక్షలు విధించే పనిలో పడ్డాయి.
ఈ తరుణంలో జర్మనీ ఇంటెలిజెన్స్ చీఫ్ అక్కడ ఎందుకు ఉన్నాడనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఆర్థిక ఆంక్షలు విధించినా పట్టించుకునేది లేదంటూ హెచ్చరించాడు పుతిన్.
ఆ దిశగానే ఆయన అడుగులు వేస్తున్నారు. అత్యవసర చర్చల కోసం అక్కడ ఉన్నాడనేది సమాచారం. దాడులు అధికం అయ్యే సరికి ఉక్రెయిన్ నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు.
అప్పటికే ఉక్రెయిన్ చీఫ్ గగనతలం మూసి వేయాలని ఆదేశించాడు. 30 రోజుల అత్యవసర పరిస్థితిని ప్రకటించాడు. ఈ సమయంలో రెండు రోజుల పాటు ప్రయాణం చేస్తూ స్వదేశానికి తీసుకు వెళ్లాల్సి వచ్చిందని టాక్.
ఒకవేళ అక్కడే ఉండి ఉన్నట్లయితే పరిస్థితి మరింత భిన్నంగా ఉండేది. ఇదిలా ఉండగా ఇప్పటికే 11 నగరాలపై పట్టు సాధించింది రష్యా సైన్యం, బాంబుల మోత మోగిస్తోంది. ఇదే సమయంలో ఉక్రెయిన్ సైతం పోటా పోటీగా పోరాడుతోంది.
Also Read : చైనా డ్రాగన్ పుతిన్ కు ఫోన్