S Jai Shankar : ప్రపంచం పాక్ ను ఉగ్రవాద దేశంగా చూస్తోంది
ప్రపంచం అలాగే ట్రీట్ చేస్తోంది
S Jai Shankar : భారత దేశ విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ షాకింగ్ కామెంట్స్ చేశారు పాకిస్తాన్ పై. ఆ దేశం గురించి కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. భారత దేశం ప్రస్తుతం ఐక్య రాజ్య సమితిలో భద్రతా మండలికి నేతృత్వం వహిస్తోంది. ఈ సందర్భంగా ప్రపంచంలో చోటు చేసుకున్న ఉగ్రవాదం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు జై శంకర్(S Jai Shankar).
నేటికీ పాకిస్తాన్ ను దేశంగా గుర్తించడం లేదని అది పూర్తిగా ఉగ్రవాదానికి కేరాఫ్ గా మారిన దేశంగా మారి పోయిందన్నారు. యావత్ ప్రపంచమంతా ఉగ్రవాద దేశంగా పరిగణిస్తోందని మండిపడ్డారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ఉగ్రవాదాన్ని అస్తిత్వ ముప్పుగా అభివర్ణించారు.
రెండేళ్లకు పైగా కరోనా సంభవించినా ముప్పు ఎక్కడి నుండి వచ్చిందనే విషయాన్ని అంతర్జాతీయ సమాజం మరిచి పోలేదన్నారు. గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం అప్రోచ్ – ఛాలెంజెస్ అండ్ వే ఫార్వర్డ్ అనే అంశంపై భారతదేశం అధ్యత వహించిన కౌన్సిల్ నిర్వహించిన సంతకం కార్యక్రమంలో సుబ్రమణ్యం జై శంకర్(S Jai Shankar) పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అనంతరం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి స్టేక్ అవుట్ లో మీడియాతో మాట్లాడారు. భారత్ కంటే ఉగ్రవాదాన్ని ఏ దేశమూ మెరుగ్గా ఉపయోగంచు కోలేదంటూ పాకిస్తాన్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి హీనా రబ్బానీ ఖర్ ఇటీవల చేసిన కామెంట్స్ పై పై విధంగా సమాధానం ఇచ్చారు జై శంకర్.
Also Read : గాంధీ విలువలు నిలబడేలా చేశాయి