Poorna Malavath : విజయానికి దగ్గరి దారులు లేవు
పూర్ణ మలావత్ కామెంట్స్
Poorna Malavath : పూర్ణ మలావత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె బాలికలకు, యువతకు ఆదర్శ ప్రాయంగా మారారు. చిన్న వయస్సు లోనే పర్వతాన్ని అధిరోహించారు. పూర్ణకు ఎన్నో పురస్కారాలు లభించాయి. కానీ ఆమె వేటి గురించి పట్టించు కోవడం లేదు. ఎందుకంటే మన శ్రమనే మనకు ఆయుధమని నమ్ముతోంది. చదువు ఒక్కటే మనల్ని మనుషుల్ని చేస్తోందని గట్టిగా విశ్వసిస్తోంది.
ఆడ పిల్లలు ఇవాళ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కానీ వాటిని ధైర్యంగా ఎదుర్కొనే మనస్తత్వాన్ని చిన్నప్పటి నుంచే అలవాటు చేసుకోవాలని పిలుపు నిచ్చింది పూర్ణ మలావత్(Poorna Malavath). ప్రతి చోటా ప్రతి క్షణం ఏదో ఒక చోట తారస పడుతూనే ఉంటాయని పేర్కొన్నారు. కానీ అన్నింటిని ఎదుర్కొనే సత్తా , ధైర్యం, పట్టుదల కేవలం మన మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే సాధ్యపడుతాయని స్పష్టం చేశారు.
శ్రమ నీ ఆయుధమైతే గెలుపు నీ బానిస అవుతుందని తాను పాటిస్తానని అదే తనను ఇంత ఎత్తుకు ఎదిగేలా చేసిందన్నారు పూర్ణ మలావత్. గతంలో కంటే ప్రస్తుతం విద్యా, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. కావాల్సిందల్లా సంకల్పం కలిగి ఉండడమేనని పేర్కొన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకోండి, దాని కోసం కష్టపడండి. ఇవాళ కాక పోయినా రేపైనా మీరే విజేతలు కాకుండా పోరన్నారు పూర్ణ మలావత్.
Also Read : ఐపీఎల్ లో టిమ్ కుక్ సందడి