Devendra Fadnavis Raut : ‘రౌత్’ ప్రాణాల‌కు ముప్పేమీ లేదు

కొట్టి పారేసిన మ‌రాఠా డిప్యూటీ సీఎం

Devendra Fadnavis Raut : మ‌రాఠా డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ షాకింగ్ కామెంట్స్ చేశారు. శివ‌సేన బాల్ సాహెబ్ ఠాక్రే పార్టీకి చెందిన జాతీయ అధికార ప్ర‌తినిధి, రాజ్య‌స‌భ ఎంపీ సంజ‌య్ రౌత్ పై(Devendra Fadnavis Raut) సెటైర్ వేశారు. ఆయ‌న కేవ‌లం సానుభూతి కోసం డ్రామాలు ఆడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ఇది పూర్తిగా అబ‌ద్ద‌మ‌ని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం సంజ‌య్ రౌత్ కు వ‌చ్చిన ముప్పు ఏమీ లేద‌న్నారు. ప్ర‌స్తుతం ఫ‌డ్న‌వీస్ ఉప ముఖ్య‌మంత్రితో పాటు రాష్ట్ర హోం శాఖ‌ను నిర్వ‌హిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపాయి. త‌న ప్రాణాల‌కు ముప్పు పొంచి ఉంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తూ త‌న‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని కోరుతూ సంజ‌య్ రౌత్ లేఖ రాశారు. ఇది తీవ్ర చ‌ర్చ‌కు దారి తీసింది మ‌హారాష్ట్ర‌లో. పెద్ద ఎత్తున పార్టీకి చెందిన శ్రేణులు ఆయ‌న నివాసానికి చేరుకున్నారు. దీనిపై తీవ్రంగా రియాక్ట్ అయ్యారు ఫ‌డ్న‌వీస్ . ఆలోచ‌న లేని ఆరోప‌ణ‌లు చేయ‌డం అల‌వాటుగా మారింద‌ని ఆరోపించారు.

ఇది పూర్తిగా ప్ర‌భుత్వాన్ని బ‌ద్నాం చేసే కుట్ర త‌ప్ప మ‌రొక‌టి కాద‌న్నారు డిప్యూటీ సీఎం. రాష్ట్ర హోం శాఖ‌కు లేఖ అంద‌డంతో దీనిపై స్పందించారు ఫ‌డ్న‌వీస్. ఇది పూర్తిగా నిరాధార‌మైన‌ది. వారు త‌మ పార్టీకి చెందిన గుర్తును కోల్పోయారు.

దీనిని త‌ట్టుకోలేక ఏవేవో ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. గ‌తంలో కూడా ఇలాంటి చౌక‌బారు విమ‌ర్శ‌లు చేశారు సంజ‌య్ రౌత్. మొద‌టి నుంచి ఇలాంటి కామెంట్స్ చేయ‌డం సంజ‌య్ రౌత్ కు అల‌వాటుగా మారింద‌ని మండిప‌డ్డారు డిప్యూటీ సీఎం(Devendra Fadnavis Raut).

Also Read : ఇది బీహార్ ఇంగ్లండ్ కాదు – నితీశ్

Leave A Reply

Your Email Id will not be published!