Bhaskar Halami : ఈ గిరిపుత్రుడు అమెరికా మెచ్చిన సైంటిస్ట్
ఒకప్పుడు ఆకలి కేకలు నేడు ప్రశంసలు
Bhaskar Halami : విజేతగా నిలవాలంటే ఏం చేయాలి. కష్టపడాలి. గుర్తింపు పొందాలంటే సక్సెస్ కావాలి. ఓ వైపు తిండికి ఇబ్బంది. ఇంకో వైపు ఎడతెగని ఆకలి. కానీ ఆ కుర్రాడు అడ్డంకులను అధిగమించాడు. ఏకంగా అమెరికా దేశంలో సీనియర్ సైంటిస్ట్ గా ఎదిగాడు.
అతడు ఎవరో కాదు మహారాష్ట్ర గిరిజన ప్రాంతానికి చెందిన భాస్కర్ హలామి(Bhaskar Halami). ఒకప్పుడు నిద్ర లేని రాత్రులు గడిపిన ఆయన ఇప్పుడు ఎందరికో స్పూర్తి దాయకంగా నిలిచాడు. ఆ జర్నీ గురించి తెలుసు కోవాలంటే ఈ కథ చదవాల్సిందే. అత్యంత విజయవంతమైన శాస్త్రవేత్తగా ఎదిగేందుకు ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నారు.
మహారాష్ట్ర లోని చిర్చడి గ్రామం నుండి మాస్టర్స్ డిగ్రీతో పాటు పిహెచ్ డి సంపాదించిన మొదటి వ్యక్తి కూడా అతడే కావడం విశేషం. ఆ గిరిజన ప్రాంతం నిత్యం తుపాకుల మోతలతో, బుల్లెట్ల శబ్దంతో దద్దరిల్లే గడ్చిరోలి లోకి వస్తుంది హలిమి. ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో సీనియర్ సైంటిస్ట్ అయ్యాడంటే ఆశ్చర్యం వేయక మానదు.
భాస్కర్ హలామీ జీవితం నిస్సందేహంగా కృషి, దృఢ సంకల్పంతో ఎవరైనా సాధించగలరు అనేందుకు ప్రత్యక్ష ఉదాహరణ. కుర్టెడా తహసిల్ లోని చిర్చడి గ్రామంలోని గిరిజన సంఘంలో పెరిగాడు భాస్కర్ హలామి.
ప్రస్తుతం ఆయన మేరిల్యాండ్ లోని బయోఫార్మాస్యూటికల్ కంపెనీ అయిన సిర్నామిక్ ఇంక్ పరిశోధన, అభివృద్ది విభాగంలో సీనియర్ శాస్త్రవేత్తగా పని చేస్తున్నార్ భాస్కర్ హలామి(Bhaskar Halami). సంస్థ జన్యు ఔషధాలలో పరిశోధనలు నిర్వహిస్తుంది. హలామి ఆర్ఎన్ఏ తయారీని పర్యవేక్షిస్తారు.
ప్రస్తుతం ఆయనకు 44 ఏళ్లు. చాలా రోజులు తిండికి ఇబ్బంది పడ్డామని గుర్తు చేసుకున్నాడు. చిర్చాడిలో 400 నుంచి 500 కుటుంబాలు నివసిస్తున్నాయి. హలామి పేరెంట్స్ గ్రామంలో ఇంటి సహాయకులుగా పని చేశారు.
తండ్రి వంట వాడిగా చేరడంతో తనకు కొంచెం చదువుకునేందుకు వీలు కలిగిందన్నాడు హలామి. తన ప్రారంభ పాఠశాల విద్యను 1 నుండి 4 వరకు కసన్సూర్ లోని ఆశ్రమ పాఠశాలలో చదివాడు. స్కాలర్ షిప్ పరీక్షలో పాసయ్యాడు. 10 వరకు యవత్మాల్ లోని ప్రభుత్వ విద్యా నికేతన్ లో పూర్తి చేశాడు.
గడ్చిరోలిలో డిగ్రీ చదివాడు. నాగ్ పూర్ లోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుండి రసాయన శాస్త్రలో మాస్టర్ డిగ్రీ పొందాడు. 2003లో నాగ్ పూర్ లోని లక్ష్మీ నారాయణ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో హలామీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నియమితులయ్యారు. మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ లో సెలెక్టు అయ్యాడు.
కానీ తన ఫోకస్ అంతా పరిశోధనపైనే. డీఎన్ఏ, ఆర్ఎన్ఏ పై ఫోకస్ పెట్టాడు. హలామి మిచిగాన్ టెక్నలాజికల్ యూనివర్శిటీ నుండి పీహెచ్ డి పొందాడు.
అమెరికాలోనే మోస్ట్ పాపులర్ సైంటిస్ట్ గా ఎదిగాడు భాస్కర్ హలామి. భారత్ కు వచ్చిన సమయంలో బడులు, ఆశ్రమ పాఠశాలలు, కాలేజీలను సందర్శిస్తున్నాడు. కష్టపడితే ఎవరైనా అనుకున్న స్థాయికి చేరవచ్చంటాడు హలామి. నిజమే కదూ.
Also Read : ఆర్బీఐ గవర్నర్ షాకింగ్ కామెంట్స్