#OpenStartup : ఓపెన్ స్టార్టప్ కు టైగర్ గ్లోబల్ ఫండింగ్
ఓపెన్ స్టార్టప్ 35 వేల కోట్ల వ్యాపారం
Open Startup: ఫైనాన్షియల్ రంగంలో సక్సెస్ ఫుల్‌గా ఆదాయాన్ని గడిస్తున్న స్టార్టప్ కంపెనీ ఓపెన్ అంకుర సంస్థ జాక్ పాట్ కొట్టేసింది. టైగర్ గ్లోబల్ సంస్థ ఏకంగా 210 కోట్లు పెట్టుబడిగా పెట్టనుంది. ఇది ఇండియన్ స్టార్టప్‌లలో ఓ రికార్డు. బ్యాంకింగ్ సర్వీసెస్ , ఎస్ఎంఇ, స్టార్టప్స్, లోన్స్, తదితర వాటికి ఈ సంస్థ ఆర్థిక సహకారం అందజేస్తుంది. టాంగ్లిన్ వెంఛర్ పార్ట్నర్స్ అడ్వయిజర్స్, 3 ఒన్ 4 కేపిటల్, స్పీడ్ ఇన్వెస్ట్ అండ్ బెటర్ కేపిటల్ , సిండికేట్ కంపెనీలు కూడా ఇందులో పెట్టుబడులు పెట్టాయి.
మోర్ ప్రాడక్ట్స్, వాల్యూ యాడెడ్ సర్వీసెస్ రంగాలలో సేవలందిస్తుంది. ఒకే ఒక్క ఏడాదిలో ఒన్ మిలియన్ ఎస్ఎంఇలకు ఫండింగ్ సమకూర్చి పెట్టింది ఓపెన్. బిజినెస్ బ్యాంకింగ్ రంగాన్ని మరింత విస్తరించేందుకు కొత్త ప్రొడక్ట్స్ ను రూపొందించే పనిలో పడింది. యుద్ధ ప్రాతిపదికన రెండు కొత్త ప్రొడక్ట్స్‌ను(Open Startup) లాంఛింగ్ చేసే పనిలో పడింది.
ఓపెన్ ప్లస్ కార్డు, బిజినెస్ క్రెడిట్ కార్డు లను అందుబాటులోకి తీసుకు రానుంది. 30 రోజుల పాటు ఎంత డబ్బు తీసుకున్నా ఎలాంటి వడ్డీ కట్టాల్సిన పనిలేదు. ఈ వెసులుబాటు ఓపెన్‌లో మాత్రమే ఉంటోంది. దీంతో చాలా మంది చిరు వ్యాపారులు, మధ్య తరహా వ్యాపారులు రుణాల కోసం ఓపెన్‌ను ఆశ్రయిస్తున్నారు. బ్యాంకుల దగ్గరకు వెళ్లాలంటే సవాలక్ష కారణాలు, ఎక్కడ లేని నియమ నిబంధనలు, రుణం మంజూరవుతుందో లేదో తెలియని పరిస్థితి.
ప్రతి అడ్డమైన కాగితాలు సబ్మిట్ చేయాల్సిందే. లేకపోతే లోన్ సాంక్షన్ కాదు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని..ముద్ర లాంటి పథకాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఓపెన్ స్టార్టప్ (Open Startup)కు శ్రీకారం చుట్టారు. డబ్బులు పుట్టాలన్నా, రుణాలు మంజూరు కావాలన్నా, లేక చేసిన అప్పులు తీర్చాలన్నా నమ్మకమే ముఖ్యం. దాని మీదే అన్ని వ్యాపారాలు నడుస్తున్నాయి అంటారు ఓపెన్ కో ఫౌండర్స్.
బిజినెస్ బ్యాంకింగ్ ఛాలెంజెస్ ను ఎదుర్కొనేందుకే 2017లో ఓపెన్ స్టార్టప్‌ను స్టార్ట్ చేశారు. సూక్ష్మ తరహా ఆంట్రప్రెన్యూర్స్‌ను ఎంటర్ టైన్ చేసేందుకు దృష్టి పెట్టింది ఓపెన్ సంస్థ. సరికొత్త ఐడియాస్‌ను ఆచరణలోకి తీసుకు రాగలిగితే , పెట్టుబడి అన్నది సమస్య కానేకాదని నిర్వాహకులు పేర్కొంటున్నారు.
కావాల్సిందల్లా ఎలా విజయవంతంగా సంస్థను నడుపుతారన్నది ముఖ్యమంటున్నారు. ఒక లక్ష మిలియన్ ఓపెన్ ద్వారా లబ్ది పొందారు. ఏకంగా 35 వేల కోట్ల లావాదేవీలు నిర్వహించారు. ప్రతి నెలా 20 వేల ఎస్ఎంఇలు లాభ పడుతున్నాయి. నియో బ్యాంకింగ్ సర్వీసెను అందజేస్తోంది ఓపెన్. ఓపెన్ ప్లస్ బిజినెస్ కార్డును ఇంట్రడ్యూస్ చేసింది.
కేవలం స్టారప్ సంస్థల కోసమే దీనిని రూపొందించారు. మిగతా బ్యాంకుల కంటే ఇది మరింత బెటర్‌గా సర్వీసెస్ అందజేస్తోంది. అనీస్ అచుతాన్ ఓపెన్ సంస్థకు కో ఫౌండర్‌గా ఉన్నారు. ఓపెన్ ఫైనాన్షియల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో దీనిని బెంగళూరులో ఏర్పాటు చేశారు.
No comment allowed please