Tim Cook Modi : మోదీ విజ‌న్ కు టిమ్ కుక్ ఫిదా

ప్ర‌ధాన‌మంత్రిని క‌లిసిన యాపిల్ సిఇఓ

Tim Cook Modi :  భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ కు ప్ర‌శంస‌లు కురుస్తూనే ఉన్నాయి. ఆయ‌న ఇప్ప‌టికే వ‌ర‌ల్డ్ వైడ్ గా మోస్ట్ పాపుల‌ర్ లీడ‌ర్ గా పేరొందారు. జాబితాలో టాప్ లో కొన‌సాగుతూ వ‌స్తున్నారు. అమెరికా, ర‌ష్యా, చైనా అధ్యక్షుల‌ను కాద‌ని న‌రేంద్ర మోదీ ప్ర‌జాద‌ర‌ణ చూర‌గొన‌డం విశేషం. ఈ త‌రుణంలో ప్ర‌ముఖ అమెరికా మొబైల్ సంస్థ యాపిల్ సిఇఓ టిమ్ కుక్(Tim Cook Modi) భార‌త్ లో ప‌ర్య‌టిస్తున్నారు. ఇందులో భాగంగా యాపిల్ మ‌న దేశంలో తొలిసారిగా యాపిల్ త‌న స్టోర్ల‌ను ఏర్పాటు చేసింది.

ఒక‌టి దేశ రాజ‌ధాని ఢిల్లీలో కాగా మ‌రొక‌టి ఆర్ధిక రాజ‌ధానిగా పేరొందిన ముంబైలోని కార్లా కాంప్లెక్స్ లో. ఏప్రిల్ 18న టిమ్ కుక్ ముంబై లోని యాపిల్ స్టోర్ ను ప్రారంభించారు. ఏప్రిల్ 20 గురువారం ఢిల్లీలోని యాపిల్ స్టోర్ ను ప్రారంభించ‌నున్నారు. ఇందులో భాగంగా మ‌ర్యాద పూర్వ‌కంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీతో భేటీ అయ్యారు టిమ్ కుక్. వారిద్ద‌రూ టెక్నాల‌జీ, అభివృద్ది, సాంకేతిక‌, ఏఐ, ఉపాధి అవ‌కాశాలు , త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చించారు.

న‌రేంద్ర మోదీకి ఉన్న విజ‌న్ త‌నను విస్తు పోయేలా చేసింద‌ని పేర్కొన్నారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌శంస‌లు కురిపించారు యాపిల్ సిఇఓ. అంత‌కు ముందు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణ‌వ్ ను కలిశారు. సాద‌ర స్వాగ‌తం ప‌లికినందుకు న‌రేంద్ర మోదీకి(PM Modi) ధ‌న్య‌వాదాలు తెలిపారు. దేశ వ్యాప్తంగా త‌మ కంపెనీ పెట్టుబ‌డులు పెట్టేందుకు సిద్దంగా ఉంద‌ని స్పష్టం చేశారు టిమ్ కుక్. విభిన్న అంశాల‌పై ఇచ్చి పుచ్చుకోవ‌డం ఆనందంగా ఉంద‌న్నారు.

Also Read : యాపిల్ సిఇఓ కుక్ ఖుష్ క‌బ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!